KOIL ALWAR TIRUMANJANAM AT SRI KALYANA VENKATESWARA SWAMY TEMPLE ON FEBRUARY 22 _ ఫిబ్రవరి 22న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirupati, 18 February 2024: Koil Alwar Tirumanjanam will be held on February 22 at Srinivasa Mangapuram temple in connection with the annual Brahmotsavam of Sri Kalyana Venkateswara Swamy which is scheduled to be held from February 29 to March 8.
On February 22, early in the morning, Swamy will be woken up and Tomalaseva, Koluvu and Panchanga Sravanam will be performed. Koil Alwar Thirumanjanam will be held from 6 am to 10 am. After that the devotees are allowed to have darshan.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఫిబ్రవరి 22న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2024 ఫిబ్రవరి 18: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 22వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో ఫిబ్రవరి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా ఫిబ్రవరి 22న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6 నుండి 10 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.