KOIL ALWAR TIRUMANJANAM HELD WITH RELIGIOUS FERVOUR _ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

“PARIMALAM” IS AN AGE OLD DISINFECTANT – TTD EO

 

SHOBHAKRUT UGADI ASTANAM ON MARCH 22

 

TIRUMALA, 21 MARCH 2023: The traditional temple cleansing ritual, Koil Alwar Tirumanjanam was observed with spiritual fervour in Tirumala temple on Tuesday.

 

Speaking on the occasion, the TTD EO Sri AV Dharma Reddy said, Koil Alwar Tirumanjanam was an ancient ritual which is usually observed four times in a year before Vaikuntha Ekadasi, annual brahmotsavam, Anivara Asthanam and Telugu Ugadi.

 

“The entire temple including roofs, walls, pooja utensils, sub shrines are cleansed thoroughly by applying an aromatic mixture made out of disinfectant herbs called ”Parimalam” which was bequeathed by our sages”, he added.

 

After the cleansing fete, devotees are allowed for Darshan.

 

Sri Shobhakrut Nama Ugadi Asthanam will be ovserved in Tirumala temple on March 22 between 7am and 9am.

 

Trust Board members Sri Maruti Prasad, Sri Madhusudhan Yadav, Sri Ramulu, Temple Peishkar Sri Sriramulu, VGO Sri Bali Reddy and others were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

– మార్చి 22న ఉగాది ఆస్థానం

 తిరుమల, 21 మార్చి 2023: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 22న ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఈవో మీడియాతో మాట్లాడుతూ సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు.

ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారని, శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారని వివరించారు. ఈ పరిమళాన్ని మన పూర్వీకులు ఎంతో కృషి చేసి మనకు వరంగా అందించారని చెప్పారు. పరిమళం ప్రోక్షణం ద్వారా క్రిమికీటకాలు రాకుండా ఆలయం పరిశుభ్రంగా ఉంటుందని, గోడలు పటిష్టంగా ఉంటాయని తెలిపారు.

స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 9 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుందన్నారు. మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, బుధవారం ఉగాది ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ మూరంశెట్టి రాములు, శ్రీ మారుతి ప్రసాద్, శ్రీ మధుసూదన్ యాదవ్, విజివో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

మార్చి 22న ఉగాది ఆస్థానం

శ్రీవారి ఆలయంలో ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.