KOIL ALWAR TIRUMANJANAM IN SRIVAR TEMPLE ON DEC 26_ తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala, 19 December 2017: As part of Vaikunta Ekadasi, the Tuesday ahead, Dec 26, Koil Alwar Tirumanjanam will be performed at the Srivari temple.

The Srivari temple will be cleaned with traditional herbs and detergents, perfumed waters etc from Bangaru vakili upto Kulasekhar Padi.

It is well known that Koil Alwar Thirumanjanam is performed four times in a year a- Ugadi, Anivara Asthanam, Brahmotsavam and finally Vaikunta Ekadasi.

The TTD has cancelled all Arjita Sevas Like Astadala padapadmaradhana rituals.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

డిసెంబరు 19, తిరుమల 2017: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ పర్వదినానికి ముందుగా వచ్చే మంగళవారం డిసెంబరు 26వ తేది కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

అందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఆలయాన్ని పవిత్రజలాలతో శుద్ధి చేస్తారు. అనంతరం పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన లేపనంతో ఆలయగోడలకు పూస్తారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు అత్యంత పవిత్రంగా ఒక మహా యజ్ఞంలా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మూెత్సవం పర్వదినాలకు ముందుగా వచ్చే మంగళవారంనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన ఆష్టదళపాదపద్మారాధన సేవను తి.తి.దే రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.