SPECIAL POOJAS ON THE OCCASION OF VAIKUNTA EKADASI INSIDE SRIVARI TEMPLE_ తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు

Tirumala,19 December 2017: TTD has scheduled special rituals and Parayanams at the Srivari temple on the occasion of Vaikunta Ekadasi and Dwadasi events on Dec 29 and Dec 30.

As part of the event Tiruppavai parayanams will be performed at Srivari temple from 12.05am to 5am on Dec 29 besides other Seva alike Tomala, abhisekam and Archana in ekatham.

Later in the morning Sri Malayyappa along with consorts will be paraded on the Swarna Ratham on the mada streets.

Again in the evening sahasra deepalankara seva will be performed before the utsava idols are taken on the mada streets in a procession.

On December 30 Dwadasi Swami puskarini theertham mukkoti is performed with the Sri Chakrathalwar procession ending with chakrasnanam.

The TTD has cancelled all the Kalyanotsavams, Unjal Seva, Arjitha Brahmotsavam and Vasanthotsavams on Dec 29 and Dec 30.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు

డిసెంబరు 19, తిరుమల 2017: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 29వ తేదీ వైకుంఠ ఏకాదశి, డిసెంబరు 30న ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇందులో బాగంగా డిసెంబరు 29వ తేది తెల్లవారుఝామున 12.05 ను8ండి 5.00 గంటల వరకు ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, అభిషేకం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 8 నుండి 9 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ కన్నుల పండుగగా జరుగనుంది. అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో కూడి తిరుచ్చిపై నాలుగమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

తిరుమలలో డిసెంబరు 30న స్వామితీర్థ ముక్కోటి

ఈ నెల 30వ తేది వైకుంఠ ద్వాదశి పర్వదినాన స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి కూడా తిరుమలలో ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 4.30 గంటల నుండి 5.30 గంటల వరకు శ్రీ చక్రత్తాళ్వార్లకు నాలుగుమాడ వీధులలో ఊరేగుతూ వరాహస్వామి ఆలయం చెంత వున్న స్వామివారి పుష్కరిణి తీర్థంలో చక్రస్నానం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా డిసెంబరు 29, 30వ తేదిలలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, మరియు వసంతోత్సవాలను తి.తి.దే రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.