KOIL ALWAR TIRUMANJANAM ON DECEMBER 22 _ డిసెంబ‌రు 22న‌ శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirumala, 19 Dec. 20: The traditional Temple cleansing fete,  Koil Alwar Thirumanjanam, will be performed in Tirumala temple on December 22 in view of Vaikunta Ekadasi December 25.

On this occasion the entire Temple will be cleaned with an aromatic mixture called Parimalam, which is applied on walls and roof. The pooja utensils will also be cleaned. This religious event takes place between 6:00 a.m. and 11:00 a.m on Tuesday. Later pilgrims will be allowed for Darshan. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

డిసెంబ‌రు 22న‌ శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమ‌ల‌, 2020 డిసెంబ‌రు 19: తిరుమల శ్రీవారి ఆల‌యంలో డిసెంబ‌రు 25న వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకుని డిసెంబ‌రు 22న‌ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఈ సంద‌ర్భంగా ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం ఉద‌యం 11.45 గంట‌ల నుండి భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మ‌వుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.