KOIL ALWAR TIRUMANJANAM PERFORMED AT TIRUCHANOOR _ శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

PADMAVATHI AMMAVARI PAVITHROTSAVAMS FROM SEPTEMBER 24 TO 26

Tirupati, September 22, 2026: The traditional Koil Alwar Tirumanjanam was performed at Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, on Tuesday as part of the preparations for the annual Pavitrotsavams from September 24 to 26.

The temple premises, walls, ceilings and puja articles were thoroughly cleansed with water. Sacred water prepared with sandalwood, turmeric, camphor, kumkum and other fragrant substances was then sprinkled throughout the temple.

Devotees were allowed for darshan from 9 am.

As part of the preparations, TTD cancelled Kalyanotsavam and Unjal Seva on Tuesday.

Pavitrotsavams from September 24

The Ankurarpanam will be performed on September 23 evening, followed by the three-day Pavitrotsavams:

September 24: Pavitra Pratishta

September 25: Pavitra Samarpana

September 26: Purnahuti

The Pavitrotsavams are conducted as per Vaikhanasa traditions to preserve the sanctity of the temple and as a prescribed ritual for rectification of any inadvertent lapses.

Several Arjitha Sevas will remain cancelled from September 23 to 26 in view of the Pavitrotsavams.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

సెప్టెంబరు 24 నుంచి 26 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

తిరుపతి, సెప్టెంబరు 22, 2026: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు ముందుగా నిర్వహించే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రతను పరిరక్షిస్తూ, వైదిక సంప్రదాయాలకు అనుగుణంగా ఈ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సెప్టెంబరు 24 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా, పవిత్రంగా సిద్ధం చేశారు.

భక్తిశ్రద్ధలతో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఈ సందర్భంగా ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర సమస్త వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలను కలిపి సిద్ధం చేసిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

ఈ పవిత్ర కార్యక్రమం అనంతరం ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కారణంగా ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజలసేవను టిటిడి రద్దు చేసింది.

సెప్టెంబరు 23 అంకురార్పణ

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 24 నుంచి 26వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్న నేపథ్యంలో, సెప్టెంబరు 23న సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

ఆలయ పవిత్రత పరిరక్షణే పవిత్రోత్సవాల ప్రధాన ఉద్దేశ్యం

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి సందర్భాల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయితే యాత్రికులు లేదా సిబ్బంది ద్వారా తెలిసో తెలియకో ఇటువంటి దోషాలు సంభవించే అవకాశం ఉంటుంది.

ఇలాంటి కారణాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం కలగకుండా, శాస్త్రోక్త పరిహారంగా ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు.

మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు

పవిత్రోత్సవాల్లో భాగంగా:

సెప్టెంబరు 24: పవిత్ర ప్రతిష్ఠ

సెప్టెంబరు 25: పవిత్ర సమర్పణ

సెప్టెంబరు 26: పూర్ణాహుతి

కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

రూ.750/- చెల్లించి గృహస్తులు ఒకరికి మూడు రోజులపాటు పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

పవిత్రోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు

పవిత్రోత్సవాల నిర్వహణలో భాగంగా భక్తుల సౌకర్యార్థం పలు ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది.

సెప్టెంబరు 23 నుండి 26వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజలసేవ, సెప్టెంబరు 24 నుండి 26వ తేదీ వరకు వేదాశీర్వచనం, సెప్టెంబర్ 25, 26వ తేదీల్లో బ్రేక్ దర్శనము, కుంకుమార్చన, లక్ష్మీపూజ సేవలు రద్దు. అదేవిధంగా సెప్టెంబరు 24న తిరుప్పావడ సేవ, 

సెప్టెంబరు 25న అభిషేకానంతర దర్శనం, సెప్టెంబరు 26న సామవేద పుష్పాంజలి సేవలను టిటిడి రద్దు చేసింది. 

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీ మునిచెంగల్రాయలు , టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చలపతి, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

టిటిడి ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.