KOSUVARIPALLE POSTERS RELEASED_ కోసువారిప‌ల్లి శ్రీ ప్రసన్నవేంకటరమణ స్వామివారి ప‌విత్రోత్స‌వాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

Tirupati, 5 Sep. 19: The annual Pavitrotsavams posters related to Sri Prasanna Venkata Ramana Swamy temple at Kosuvaripalle were released by JEO Sri P Basant Kumar in his chambers in TTD Administrative Building on Thursday.

This three day fete will be observed by TTD from September 9-11 with Ankurarpanam on September 8. Everyday evening there will be Veedhi Utsavam in connection with this celestial fete at 6pm.

Temple DyEO Sri Ellappa, Temple Inspector Sri Sai Chaitanya were also present in the release event.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI ప్రకటన

కోసువారిప‌ల్లి శ్రీ ప్రసన్నవేంకటరమణ స్వామివారి ప‌విత్రోత్స‌వాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

తిరుపతి, 2019 సెప్టెంబ‌రు 05: టిటిడికి అనుబంధంగా ఉన్న తంబళ్లపల్లి మండలం కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్నవేంకటరమణ స్వామివారి వార్షిక ప‌విత్రోత్స‌వాల గోడ‌ప‌త్రిక‌ల‌ను టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ గురువారం ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వనంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ ఆల‌యంలో సెప్టెంబరు 9 నుండి 11వ తేదీ వరకు ప‌విత్రోత్స‌వాలు జరుగనున్నాయి. సెప్టెంబరు 8న సాయంత్రం అంకురార్పణం నిర్వ‌హిస్తారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

సెప్టెంబరు 9వ తేదీ ఉదయం 7.30 నుండి 11.00 గంట‌ల వ‌ర‌కు చ‌తుష్టార్చాన‌, ప‌విత్ర ప్ర‌తిష్ఠ‌, సాయంత్రం 6.00 గంట‌ల‌కు భ‌గ‌వ‌తారాధ‌న‌ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 10న‌ ఉదయం 7.30 నుండి మ‌ధ్యాహ్రం 12.30 గంటల వరకు పవిత్ర సమర్పణ చేప‌డ‌తారు. సెప్టెంబరు 11న ఉదయం 8.00 నుండి మ‌ధ్యాహ్నం 1.00 గంటల వరకు స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, పవిత్ర వితరణ, మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. సాయంత్రం 6.00 గంటల నుండి స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం నిర్వహిస్తారు. రూ.200/- చెల్లించి గృహ‌స్తులు (ఇద్ద‌రు) ప‌విత్రోత్స‌వాల్లో పాల్గొన‌వ‌చ్చు. గృహ‌స్తుల‌కు చివ‌రిరోజు ఒక ప‌విత్ర‌మాల‌ను, తీర్థ‌ప్ర‌సాదాల‌ను బ‌హుమానంగా అంద‌జేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ఎల్ల‌ప్ప‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ సాయి చైత‌న్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.