JOINT INSPECTION BY CVSO AND SP_ భక్తుల భద్రతే లక్ష్యంగా ప‌టిష్ట భ‌ద్ర‌తా ఏర్పాట్లు : టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి

Tirumala, 5 Sep. 19: In view of ensuing annual Brahmotsavams, a joint inspection was conducted by CVSO Sri Gopinath Jatti and Tirupati Urban SP Sri Anburajan along with TTD Vigilance and police officials respectively in the four mada streets of Tirumala on Friday.

After inspection, speaking to media they said, the points where security need to be enhanced has been notified along with parking areas for the upcoming annual fete in Tirumala. “If any more amendments we want regarding barricading, erecting security measure structures will be taken care of”, they added.

Additional CVSO Sri Sivakumar Reddy, VGOs Sri Manohar, Sri Prabhakar, ASP Sri Umashankar Raju and other officers were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భక్తుల భద్రతే లక్ష్యంగా ప‌టిష్ట భ‌ద్ర‌తా ఏర్పాట్లు : టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి

తిరుమల, 2019 సెప్టెంబ‌రు 05: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు ఆనందంగా స్వామివారిని దర్శించుకునేలా, వారి భద్రతే లక్ష్యంగా టిటిడి విజిలెన్స్‌, పోలీస్‌ సిబ్బందితో ప‌టిష్ట‌మైన భ‌తాద్ర ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి తెలిపారు. తిరుమల నాలుగు మాడ వీధులలో మరియు ఇతర ప్రాంతాలలో భ‌ద్ర‌తా ఏర్పాట్లపై గురువారంనాడు సివిఎస్వో , తిరుపతి అర్బన్‌ ఎస్‌.పి శ్రీ అన్భురాజ‌న్‌తో కలసి ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్బంగా సివిఎస్వో మీడియాతో మాట్లాడుతూ గ‌త‌ బ్రహ్మోత్సవాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సారి బ్రహ్మోత్సవాలలో టిటిడి విజిలెన్స్‌ మ‌రియు పోలీస్‌ సిబ్బంది సమన్వయంతో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహన సేవలు తిలకించడానికి ఏర్పాటు చేయడమే తమ ముఖ్య లక్ష్యమన్నారు. ధ్వ‌జారోహ‌ణం రోజున గౌ..ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు ప‌టిష్ఠ బందోబ‌స్తు, బ్యారికేడింగ్, గ‌రుడ సేవ‌నాడు తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో పార్కింగ్ ప్రాంతాల‌ను ప‌రిశీలించామ‌న్నారు. భ‌క్తుల‌కు సుల‌భంగా తెలిసేలా తిరుమ‌ల‌, తిరుప‌తి ముఖ్య కూడ‌ల‌ళ్ళ‌లో వివిద భాష‌ల‌లో సైన్‌బోర్డులు, సూచిక‌బోర్డులు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు.

ప్ర‌ణాళికాబ‌ద్ధంగా బందోబ‌స్తు : తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ శ్రీ అన్బురాజ‌న్‌

బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాటుచేస్తామ‌ని తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ శ్రీ అన్బురాజ‌న్ తెలిపారు. క్రైమ్‌, ట్రాఫిక్ విభాగాల‌పై ప్ర‌త్యేక‌దృష్టి పెడ‌తామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఏఎస్పి శ్రీ ఉమాశంక‌ర్‌రాజు, విఎస్వోలు శ్రీ మ‌నోహ‌ర్, శ్రీ ప్ర‌భాక‌ర్‌, ఎవిస్వోలు శ్రీ వీర‌బాబు, శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఇత‌ర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.