KOTI TALAMBRALU PRESENTED _ శ్రీ సీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పణ

VONTIMITTA, 04 APRIL 2023: For the celestial Sri Sita Rama Kalyanam at Vontimitta on April 5, Sri Kalyana Appa Rao of Sri Krishna Chaitanya Sangham from East Godavari presented one crore Talambralu.

He has handed over the 180 kilos of Talambralu to the temple DyEO Sri Natesh Babu at Sri Kodandaramalayam.

The donor has been offering the Talambralu to Bhadrachalam Sri Rama from the past 12 years and since six years to Vontimitta Sri Kodandarama temple.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ సీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పణ

ఒంటిమిట్ట, 04 ఏప్రిల్ 2023: ఒంటిమిట్టలో బుధవారం జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు శ్రీ కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను మంగళవారం సమర్పించారు. మొత్తం 180 కిలోల బరువైన ఈ తలంబ్రాలను ఆలయం వద్ద డెప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, అర్చకులు శ్రీ శ్రావణ్ కుమార్ సమక్షంలో అందించారు.

ఈ తలంబ్రాల కోసం ఆరు నెలల పాటు వరిని ప్రత్యేకంగా పండించి నాలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎంతో భక్తిభావంతో మూడు నెలల పాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారు. ఈ సంఘం ఆధ్వర్యంలో 12 ఏళ్లుగా భద్రాద్రి రామునికి, ఆరేళ్లుగా ఒంటిమిట్ట రామునికి కల్యాణోత్సవం సందర్భంగా అందజేస్తున్నామని శ్రీ కళ్యాణ అప్పారావు తెలిపారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.