SEPTEMBER EVENTS AT SRI KRT_ సెప్టెంబరులో శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

SEPTEMBER EVENTS AT SRI KRT

September 7,14,21,28: Special Abhisekam on Saturday’s. Evening parade and unjal seva,

September 14: Astothara Kalashabisekam on Pournami day

September 24: Sitarama Kalyanam. Unjal Seva and Tiruchi utsava

September 28: Sahasra Kalasabhisekam on Amavasya day and Hanumanta vahanam in the evening.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబరులో శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2019 ఆగస్టు 27: శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– సెప్టెంబరు 7, 14, 21, 28వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– సెప్టెంబరు 14న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.00 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. రూ.50/- చెల్లించి భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు.

– సెప్టెంబరు 24న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11.00 గంటలకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గ హస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం, అక్కడే ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– సెప్టెంబరు 28న అమావాస్యనాడు ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా నిర్వహిస్తారు. రూ.500/- చెల్లించి గ హస్తులు(ఇద్దరు) ఈ సేవలో పాల్గొనవచ్చు. గ హస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు. సాయంత్రం 7.00 నుంచి రాత్రి 9.00 గంటల నడుమ హనుమంత వాహనసేవ జరుగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.