శ్రీకోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం
శ్రీకోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం
తిరుపతి, 2017 డిసెంబరు 03: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం అష్టోత్తర శతకలశా భిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని ముఖ మండపంలో ఉదయం 9.00 గంటలకు అమ్మవారు, స్వామివార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం చేశారు.
అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో కృత్తిక దీపోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి సూపరింటెండెంట్ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శేషారెడ్డి పెద్ద సంఖ్యల1ో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.