VISIT OF CHIEF PONTIFF OF SHREE VYASARAJA MUTT, SOSALE TO TIRUMALA_ శ్రీవారిని దర్శించుకున్న శ్రీ వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ
Tirumala, 3 December 2017: His Holiness Sri Sri 1008 Sri Vidhya Shreesha Theertha Swamiji, Pontiff of SHREE VYASARAJA MUTT, SOSALE received by TTD Executive Officer Sri Anil Kumar Singhal with temple honors infront of the Sri Vari Temple, Tirumala on Sunday morning.
DyEO Sri Rama Rao, Peishkars Sri Ramesh, Sri Ashok, OSD Sri Seshadhri, Bokkasam Incharge Sri Gururaja Rao and others were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న శ్రీ వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ
డిసెంబరు 03, తిరుమల, 2017: కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ ద్వైత సంస్థానంగా పేరుగాంచిన శ్రీ వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
స్వామిజీ ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఇస్తికఫాల్ స్వాగతం పలికి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి దర్శనం చేయించారు. అక్కడ శఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీ వ్యాసరాజ మఠానికి 41వ మఠాధిపతిగా శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ కొనసాగుతున్నారు. 8 శతాబ్దాలకు పైగా చరిత్ర గల ఈ మఠం వ్యవస్థాపకులు శ్రీమద్ ఆనందతీర్థ భగవత్పాదులవారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామరావు, ఒఎస్‌డి పాల శేషాద్రి, బొక్కసం ఇన్‌చార్జ్ శ్రీ గురాజస్వామి, ఇతర అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.