KRT TEPPOTSAVAM BEGIN WITH GRANDEUR _ వైభవంగా శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ప్రారంభం

Tirupati, 21 April 2024: Sri Kodandarama Swamy Teppotsavam started with grandeur at Sri Ramachandra Pushkarini on Sunday.  

Special programs were organized in the temple on this occasion.

As a part of this, in the morning, Sri Sita Utsavarlu conducted Snapana Tirumanjanam.

The Utsava Murthies were taken for rounds on float in Sri Ramachandra Pushkarini held from 7 pm to 8.30 pm.  

Temple Deputy EO Smt. Nagaratna, AEO Sri Parthasarathy, Superintendent Sri. Somasekhar, temple priests and a large number of devotees participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2024 ఏప్రిల్ 21: తిరుపతి శ్రీకోదండరామస్వామి తెప్పోత్సవాలు ఆదివారం శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను రామచంద్ర పుష్కరిణికి వేంచేపు చేశారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు తెప్పోత్సవం నిర్వహించారు. విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతారామలక్ష్మణులు ఆశీనులై ఐదుచుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు.

ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగ‌ర‌త్న‌, ఏఈవో శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.