KT PAVITROTSAVAMS POSTERS RELEASED_ శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
Tirupati, 27 Jun. 19: The posters of annual Pavitrotsavams of Sri Kapileswara Swamy temple were released by Tirupati JEO Sri B Lakshmikantham at the meeting hall in TTD Administrative Building in Tirupati on Thursday.
The three day celestial fete will be observed in the temple from July 13 to 15 with Ankurarpanam on July 12. On the first day on July 13, Pavitra Pratista, July 14 Grandhi Pavitra Samarpana and on final day Maha Purnahuti will be observed.
Temple DyEO Sri Subramanyam was also present during the posters release. Later the JEO also felicitated Sri Swaminathan Gurukul, Sri Manivasagan Gurukul, Sri Udayashankar Gurukul and Sri Karthikeya Gurukul for effectively offering religious services during various occasions in the temple.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
తిరుపతి, 2019 జూన్ 27: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 13 నుండి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాల గోడపత్రికలను గురువారం సాయంత్రం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి. లక్ష్మీకాంతం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశమందిరంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ జూలై 13వ తేది మొదటిరోజు పవిత్ర ప్రతిష్ఠ, జూలై 14వ తేది రెండో రోజు గ్రంధి పవిత్ర సమర్పణ, జూలై 15వ తేది మూడో రోజు మహాపూర్ణాహుతి క్రతువులు నిర్వహిస్తారని తెలిపారు. జూలై 12న పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారని అన్నారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయని, వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారన్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో పౌర్ణమి ముందున్న చతుర్దశి నాటికి పూర్తయ్యేలా మూడు రోజుల పాటు స్వామివారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు.
ఇందులో భాగంగా ప్రతిరోజూ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం పంచమూర్తులైన శ్రీకపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షమ్మ అమ్మవారు, శ్రీవిఘ్నేశ్వరస్వామి, శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీచండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు కల్యాణమండపంలో స్నపనతిరుమంజనం చేపడతారు.
ఈ పవిత్రోత్సవంను ఆర్జితం సేవగా ప్రవేశపెట్టారు. రూ.500/- చెల్లించి ఇద్దరు గ హస్థులు పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న గ హస్థులకు ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికె, చివరిరోజు పవిత్రమాలలు బహుమానంగా అందజేస్తారు.
అంతకుముందు శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వివిధ ఉత్సవాలలో మెరుగ్గా సేవలు అందించినందుకు గాను ఆలయ అర్చకులు శ్రీ యు. స్వామినాథన్ గురుకుల్, శ్రీ మణివాసగన్ గురుకుల్, శ్రీ యు. ఉదయశంకర్ గురుకుల్, శ్రీ కె. కార్తీకేయ గురుకుల్ లను తిరుపతి జెఈవో శ్రీ బి. లక్ష్మీకాంతం సన్మానించి ప్రశంసా పత్రాలను అందించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ పి.సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ దిలీప్ కుమార్, శ్రీ రెడ్డి భాస్కర్, శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.