JEO REVIEWS ON DEVELOPMENT WORKS_ టిటిడి అభివృద్ధి కార్యక్రమాలపై తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం సమీక్ష

Tirupati,27 Jun. 19: Tirupati JEO Sri B Lakshmikantham on Thursday reviewed the ongoing development works related to various departments in Tirupati.

The review meeting was held in the meeting hall with all the senior officers. He said the pending works including diversion of roads in Sri Padmavathi Ammavari temple at Tiruchanoor, Four laner road at Alipiri-Cherlopalle and the clearances needed from the forest and irrigation departments, 3D laser mapping of jewelry, etc. has been reviewed with the concerned officials.

He also reviewed on postage charges while delivering TTD calendars and diaries, lands to construct Sri Venkateswara Divya Kshetrams at various places, how to mobilize cultural troupes from different states for upcoming annual brahmotsavams, development works at Bugga Agraharam, on Kalyana Mandapams, Vedapathashalas, Srinivasam, Avilala tank works, donor cottage renewals, jewelry verification etc. have also been discussed.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

టిటిడి అభివృద్ధి కార్యక్రమాలపై తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం సమీక్ష

జూన్‌ 27, తిరుపతి, 2019: టిటిడి స్థానిక ఆలయాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో జెఈవో గురువారం వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడిలోని స్థానిక ఆలయాలలో పెండింగ్‌లో ఉన్న ఇంజనీరింగ్‌ పనులు, ఆభరణాల నమోదు తదితర పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. శ్రీ ఎస్వీ ఆయుర్వేదిక్‌ కళాశాలలో ఐఎస్‌వో ప్రమాణాల మేరకు ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం శ్రీవారి సేవలు, స్థానిక ఆలయాల స్థల పురాణం, సేవలు, దశావతారాలు తదితర ముఖ్యమైన అంశాలపై సంక్షిప్తంగా వీడియో రూపొందించి ఎస్వీబీసీలో ప్రసారం చేయాలన్నారు. అవిలాల చెరువు అభివృద్ధి పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. భక్తులతో భవదీయుడు కార్యక్రమంలో భక్తులు అందించిన సూచనలు, సలహాలను అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. టిటిడి రోడ్లలో విద్యుత్‌ వెలుగుల్లో శంఖుచక్రాలు కనిపించేలా ఏర్పాటుచేస్తున్న గోవిందమాల పనులు, సప్తగిరి మాసపత్రిక చందాదారుల సంఖ్యను మరింత పెంచే అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రానున్న బ్రహ్మూెత్సవాలకు వివిధ రాష్ట్రాల నుండి అవసరమైన కళాకారుల జాబితాను ఇప్పటినుంచే సిద్ధం చేసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డిలు, ఎస్‌ఇలు శ్రీ రమేష్‌రెడ్డి, శ్రీరాములు, శ్రీ వేంకటేశ్వర్లు, ఎస్టేట్‌ ఆఫీసర్‌ శ్రీవిజయసారధి, డెప్యూటీ ఈవోలు శ్రీమతి వరలక్ష్మీ, శ్రీ దామోదరం, శ్రీ రామ్మూర్తిరెడ్డి, శ్రీమతి లక్ష్మీనరసమ్మ, శ్రీ ఇసి.శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.