KT PAVITROTSAVAMS _ జూన్ 30 నుండి జూలై 2వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

TIRUPATI, 11 JUNE 2023: The annual Pavitrotsvams will take place between June 30 and July 2 in Sri Kapileswara Swamy temple in Tirupati with Ankurarpanam on June 29.

On first day Pavitra Pratista, Second Pavitra Puja and on the final day Pavitra Purnahuti will be performed.

In the evening Abhishekam will be performed to Sri Kapileswara Swamy, Sri Kamakshi Devi, Sri Vighneswara Swamy, Sri Subrahmanya Swamy, Sri Chandikeswara Swamy.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

జూన్ 30 నుండి జూలై 2వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2023 జూన్ 11: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం జూన్ 29న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా జూన్ 30న మొద‌టిరోజు ఉదయం ఉత్స‌వ‌మూర్తుల‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, ‌సాయంత్రం క‌ల‌శ‌పూజ‌, హోమం, ప‌విత్ర ప్ర‌తిష్ఠ నిర్వ‌హిస్తారు. జూలై 1న రెండో రోజు ఉద‌యం గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, ‌సాయంత్రం యాగ‌శాల‌పూజ‌, హోమం చేప‌డ‌తారు. జూలై 2న ఉద‌యం మ‌హాపూర్ణాహుతి, క‌ల‌శోధ్వాస‌న‌, ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హిస్తారు. ‌సాయంత్రం 6 గంట‌ల‌కు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లకు ఏకాంతంగా ఆస్థానం నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.