శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మూెత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : తిరుపతి ఇన్‌చార్జి జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మూెత్సవాలకు విస్తృత ఏర్పాట్లు : తిరుపతి ఇన్‌చార్జి జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

ఫిబ్రవరి 05, తిరుపతి, 2018: తిరుపతిలోని శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మూెత్సవాలు ఫిబ్రవరి 6 నుండి 15వ తేదీ వరకు జరుగనున్నాయని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టిటిడి తిరుపతి ఇన్‌చార్జి జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. ఆలయంలో జరుగుతున్న బ్రహ్మూెత్సవాల ఏర్పాట్లను సోమవారం సాయంత్రం జెఈవో పరిశీలించారు. దర్శనం, ప్రసాద వితరణ, వాహనసేవల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని ఈ సందర్భంగా ఆలయ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ బ్రహ్మూెత్సవాలకు సోమవారం అంకురార్పణ జరిగినట్టు తెలిపారు. ఫిబ్రవరి 13న మహాశివరాత్రి సందర్భంగా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని, ఇందుకోసం పోలీసులతో చర్చించి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ చర్యలు చేపడతామన్నారు. తిరుపతి, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి,అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ శంకర్‌రాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నారాయణ, శ్రీ మురళీకృష్ణ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 6న ధ్వజారోహణం :

ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం ఉదయం 8.30 గంటలకు కుంభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు పల్లకి ఉత్సవం, సాయంత్రం 7.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి.

బ్రహ్మూెత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబ ందాలు సాంస్క తిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మూెత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

06-02-2018(మంగళవారం) ధ్వజారోహణం(కుంభలగ్నం) హంస వాహనం

07-02-2018(బుధవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

08-02-2018(గురువారం) భూత వాహనం సింహ వాహనం

09-02-2018(శుక్రవారం) మకర వాహనం శేష వాహనం

10-02-2018(శనివారం) అధికారనంది వాహనం తిరుచ్చి ఉత్సవం

11-02-2018(ఆదివారం) వ్యాఘ్ర వాహనం గజ వాహనం

12-02-2018(సోమవారం) కల్పవ క్ష వాహనం తిరుచ్చి ఉత్సవం

13-02-2018(మంగళవారం) రథోత్సవం(భోగితేరు) నందివాహనం

14-02-2018(బుధవారం) పురుషామ గవాహనం కల్యాణోత్సవం, అశ్వవాహనం

15-02-2018(గురువారం) శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,

సూర్యప్రభ వాహనం. ధ్వజావరోహణం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.