ALL ARRANGEMENTS IN PLACE FOR SRI KT AND SKVST BTUs- JEO SRI KS SREENIVASA RAJU_ అంగరంగ వైభవంగా శ్రీ కళ్యాణవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు – తిరుపతి ఇన్‌చార్జ్ జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
Tirupati, 5 February 2018: TTD has geared up for the twin annual festivals at the famous sub-temples of Sri Kapileswara Swamy (Sri KT) in Tirupati and Sri Kalyana Venkateswara Swamy (SKVST) at Srinivasa Mangapuram which will commence with Dhwajarohanam on Tuesday, said Tirumala JEO Sri KS Sreenivasa Raju who is also at present in-charge of Tirupati jurisdiction.
After inspecting the arrangements at both the temples, speaking to media at Srinivasa Mangapuram, the JEO said, both the temples under the umbrella of TTD are considered to be most important. While the annual brahmotsavams at SKVST will conclude on February 14 and in SKT on February 15. The JEO said, akin to Tirumala brahmotsavams, the Lord Kalyana Venkateswara Swamy will take celestial ride on different vahanams both in morning and in the evening. Garuda Seva falls on February 10, Swarna Ratham on February 11, Rathotsavam on February 13 and Chakrasnanam on February 14 which are considered to be most important days here. The devotees from surrounding villages takes part in large numbers and TTD has made elaborate arrangements for the same with a concrete traffic plan”, he added.
The JEO also briefed on Sri KT brahmotsavam arrangements and said, Nandi Vahanam on the auspicious day of Mahasivaratri on February 13 is considered to be very important in the temple as tens of thousands of people converge on this day. All the arrangements including security are in place for this big day”, he maintained.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
అంగరంగ వైభవంగా శ్రీ కళ్యాణవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు – తిరుపతి ఇన్‌చార్జ్ జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు
తిరుపతి, 2018 ఫిబ్రవరి 05: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని టిటిడి తిరుపతి ఇన్‌చార్జ్ జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవో సోమవారం సాయంత్రం అధికారులతో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ నెల 6వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై 14వ తేదీన ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీలేని విధంగా ఏర్పాట్లు చేసి తిరుమల బ్రహ్మోత్సవాలను తలపించేలా నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఫిబ్రవరి 10న గరుడసేవ, ఫిబ్రవరి 11న స్వర్ణ రథోత్సవము, ఫిబ్రవరి 13న రథోత్సవం, ఫిబ్రవరి 14న చక్రస్నానం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. శ్రీవారి వాహనసేవలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాలని కోరారు.
కాగా, తిరుమల, తిరుచానూరు బ్రహ్మోత్సవాలలాగే ఇక్కడ కూడా హారతి పాయింట్లు ఏర్పాటు చేసి వాహనసేవల సమయాల్లో ప్రత్యేక హారతిని అందించాలన్నారు. వేద పాఠశాల నుండి అర్చకులు, వేద పండితులు ద్వారా వేదపారాయణం ఏర్పాటు చేయాలని ఆధికారులను ఆదేశించారు.
ఫిబ్రవరి 10వ తేదీ తిరుపతిలోని కెటి రోడ్డులోని టిటిడి పరిపాలన భవనం నుండి శ్రీనివాసమంగాపురం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ శోభాయాత్రలో గరుడసేవ రోజు తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారికి అలంకరించే లక్ష్మీహారాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు వివరించారు.
స్వామివారి పుష్కరిణి వద్ద ప్రత్యేక ఆకర్షణగా వివిధ దేవతా మూర్తుల ఎల్‌ఇడి లైటింగ్‌తో కటౌట్లు, వాహనసేవల వివరాలతో పుస్తకాలు ముద్రించి, భక్తులకు అందిచాలని, పుస్తక విక్రయశాలలు తొమ్మిది రోజుల పాటు ఉండేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో వుంచాలని ప్రజాసంబంధాల అధికారిని ఆదేశించారు.
హిందూ ధర్మప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్.వి. సంగీత కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహనసేవల ముందు భజనలు, కోలాటాలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణలు, ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ముందస్తుగా క్యూలైన్లు, చలువపందిళ్లు, అన్ని కూడళ్లలో ఫ్లెక్సీ బోర్డులు, విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో దేదీప్యమానంగా విద్యుద్దీపాలంకరణలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా స్వామివారి ప్రసాదం కౌంటర్లను పెంచాలన్నారు. మొబైల్ టాయ్‌లెట్లు, ప్రథమ చికిత్స కేంద్రాలను, అంబులెన్సులను, పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పోలీస్ మరియు టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ సమావేశంలో టీటీడీ అదనపు సివి అండ్ ఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్.ఇ.(ఎలక్ట్రికల్) శ్రీ వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు శ్రీ వెంకటయ్య, శ్రీమతి వరలక్ష్మీ, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు, ఇఇ శ్రీ మనోహర్, ఏఈ శ్రీ నాగరాజు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.