శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చనకు ఏర్పాట్లు పూర్తి

శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చనకు ఏర్పాట్లు పూర్తి

ఆగస్టు 16, తిరుపతి, 2017: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారికి ఆగస్టు 18వ తేదీన లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఉదయం విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, సంకల్పంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి విడత కుంకుమార్చన నిర్వహిస్తారు. ఆ తరువాత నైవేద్యం, హారతి ఉంటుంది. తిరిగి సాయంత్రం 4.00 నుంచి 6.00 గంటల వరకు రెండో విడత కుంకుమార్చన జరుగనుంది. అనంతరం నివేదన, దీపారాధన, హారతి, తీర్థప్రసాద వినియోగం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగిస్తారు.

గహస్తులు(ఇద్దరు) రూ.200/- చెల్లించి కుంకుమార్చన సేవలో పాల్గొనవచ్చు. గ హస్తులకు ఒక లడ్డూ, కుంకుమ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.