PAVITROTSAVAMS IN VONTIMITTA FROM AUGUST 22-24_ ఆగస్టు 21 నుండి 24వ తేదీ వరకు ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

Tirupati, 16 Aug,2017: The annual three-day pavitrotsavams in the ancient shrine of TTD taken over temple at Vontimitta in Kadapa district will be observed from August 22-24.

On August 21 Ankurarpana and Vishwaksena Aradhana will be observed while on August 22 Pavitra Pratishta, August 23 Pavitra Samarpana and August 24 Pavitra Purnahuti will be performed.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆగస్టు 21 నుండి 24వ తేదీ వరకు ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

ఆగస్టు 16, తిరుపతి, 2017: టిటిడి పరిధిలోని కడప జిల్లా ఒంటిమిట్టలో గల శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 21 నుండి 24వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 21న విష్వక్సేనారాధన, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.

ఆలయంలో సంవత్సరం పొడవునా జరిగిన పలు క్రతువుల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల వల్ల ఒక సంవత్సరంపాటు యజ్ఞం చేసినంత ఫలితం కలుగుతుందని అర్చకులు చెబుతున్నారు.

ఆగస్టు 22న ఉదయం చతుష్టానార్చాన, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం పవిత్ర హోమం నిర్వహిస్తారు. ఆగస్టు 23న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం పవిత్రహోమాలు చేపడతారు. ఆగస్టు 24న మహాపూర్ణాహుతి, పవిత్ర వితరణ కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.