KUPCHANDRAPETA UTSAVAM HELD _ ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం
TIRUPATI, 06 FEBRUARY 2023: On the day after Magha Pournami, Petotsavam was held at Kupchandrapeta, a village near Tirupati on Monday.
Sri Sita Lakshmana Sameta Sri Ramachandra Swamy were taken to the village and Snapanam was performed. Later in the evening the deities were brought back to Sri Kodanda Ramalayam after observing Unjal Seva and Gramotsavam.
Both the seers of Tirumala, temple DyEO Smt Nagaratna, AEO Sri Mohan and other temple staff were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం
తిరుపతి, 06 ఫిబ్రవరి 2023: తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి పేట ఉత్సవం సోమవారం ఘనంగా జరిగింది. మాఘపౌర్ణమి మరుసటి రోజు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను తిరుపతి సమీపంలోని కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుండి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు బయల్దేరింది. ఉదయం 9.30 గంటలకు తిరుపతికి
8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంది. అక్కడ ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం సాయంత్రం ఊంజల్‌సేవ చేపట్టారు. ఆ తరువాత గ్రామోత్సవం నిర్వహించి ఆలయానికి చేరుకున్నారు.
ఉదయం, సాయంత్రం జరిగిన స్వామివారి ఊరేగింపులో టీటీడీ హిందూధర్మ ప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, టీటీడీ శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ మోహన్, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, అర్చకులు శ్రీ ఆనందకుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు
శ్రీ కె.చలపతి, శ్రీ సురేష్ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.