KUPCHANDRAPETOTSAVAM ON FEB 11 / శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు

Tirupati, 8 February 2017: On the occasion of Magha Pournami on February 11, special Snapana Tirumanjanam will be performed to the processional deities of Sri Sita Rama Lakshmana Swamy in Kupchandrapeta located about 8km from Tirupati.

Later the deities are offered Unjal Seva in the evening between 4pm and 5pm. The deities will return to Sri Kodanda Rama Swamy temple by 9pm.

The HDPP wing of TTD has organised special devotional programmes on this occasion in this village.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు

మాఘపౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 11వ తేదీ శనివారం తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.

శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులు ఉదయం 6.00 గంటలకు ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు ఉదయం 10.00 గంటలకు చేరుకుంటాయి. అక్కడ ఉదయం 11.00 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటల వరకు ఊంజల్‌సేవ చేపడతారు. సాయంత్రం 5.30 గంటలకు అక్కడి నుండి బయల్దేరి రాత్రి 9.00 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపులో తితిదే హిందూధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.