OVER 11L VISIT TTD WEBSITE FOR TTD PUBLICATIONS / ఆన్‌లైన్‌లో టిటిడి ప్రచురణలు, భక్తి సంకీర్తనలకు విశేష ఆదరణ
Tirupati, 8 February 2017: The e-publications of TTD are garnering huge response among netizens with over eleven lakhs visiting TTD website to download these books in the last two years span.
With the instructions of TTD EO Dr D Sambasiva Rao, TTD has uploaded all its CDs and publications on its official website, www.tirumala.org for the sake of global devotees in March 2015. The books included 1197 in Telugu, 226 in English, 181 in Tamil, 175 in Kannada, 70 in Sanskrit and 2 in Banjara languages.
There are about 3500 currently available on website including Potana Bhagavatham, Mahabharatam, Vedic books, Puranas and many other important book that are related to Hindu Sanatana Dharma. Apart from these about 14892 Annamacharya Sankeertana CDs are also available on net and the devotees can download them. Besides, recently TTD has also uploaded 14 volumes of Annamaiah Pataku Pattabhishekam CDs on website. The Sapthagiri Magazine starting from the year 1975 are also available on website.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఆన్‌లైన్‌లో టిటిడి ప్రచురణలు, భక్తి సంకీర్తనలకు విశేష ఆదరణ
ధర్మప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన ప్రచురణలు, భక్తి సంకీర్తనలకు భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. పెద్ద సంఖ్యలో భక్తులు వీటిని డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. తితిదే కార్యనిర్వహణాధికారి డా||డి.సాంబశివరావు సూచనల మేరకు 2015, మార్చి 21న టిటిడి వెబ్‌సైట్‌లో ఇ-పబ్లికేషన్స్‌ను ప్రారంభించారు. ఇప్పటి వరకు వివిధ భాషలకు చెందిన 3500లకు పైగా గ్రంథాలను భక్తులకు అందుబాటులో ఉంచడమైనది. 11 లక్షల మందికిపైగా పాఠకులు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించారు.
వీటిలో శ్రీవారి వైభవాన్ని తెలిపే పుస్తకాలతో పాటు అనేక ధార్మిక విషయాలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన పుస్తకాలు ఆకట్టుకుంటున్నాయ. టిటిడి ముద్రించిన గ్రంథాలను, ముద్రణకు ఆర్థిక సహాయం చేసిన గ్రంథాలను అంతర్జాలంలో నిక్షిప్తం చేసి విశ్వవ్యాప్తం చేయాలని సంకల్పించింది. ఇందులో 1.వైదిక సాహిత్యం, 2.పురాణ, ఇతిహాస సాహిత్యం, 3.కావ్యప్రబంధ సాహిత్యం, 4.సంకీర్తన సాహిత్యం, 5.శతక బాల సాహిత్యం, 6.ఆలయ ఆగమసాహిత్యం, 7.సర్వస్వం అనే ఏడు విభాగాల్లో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌లో తెలుగులో 1197, సంస్కృతం-70, ఇంగ్లీషు-226, కన్నడం-175, హిందీ-181, తమిళం-302, బంజారా-2 గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మహాభారతం, పోతన భాగవతం లాంటి గ్రంథాలను కూడా పొందుపరిచారు. భగవద్ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ వెబ్‌సైట్‌లో రామానుజులకు సంబంధించిన సంకీర్తనలు, పాశురాలు, గ్రంథాలను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. అంతేగాక, తితిదే సప్తగిరి మాసపత్రిక ప్రతులు 1975వ సంవత్సరం నుంచి ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్‌లో అన్నమయ్య సంకీర్తనలు :
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆంతరంగిక భక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమయ్య 608వ జయంతిని పురస్కరించుకుని 2016, మే 21వ తేదీన ”అన్నమయ్య పదసాహిత్యం” పేరుతో సమగ్ర సాహిత్యాన్ని, సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
సంకీర్తనల విభాగంలో మొత్తం 14,892 సంకీర్తనలు అందుబాటులో ఉన్నాయి. ఆడియో విభాగంలో అన్నమయ్య కీర్తనలను అప్పటికప్పుడు వినడంతోపాటు డౌన్‌లోన్ చేసుకునే సౌకర్యం కల్పించారు. మొత్తం 100 అల్బమ్‌లు ఉన్నాయి. ఒక్కో ఆల్బమ్‌లో 8 నుంచి 10 సంకీర్తనలు ఉన్నాయి.
లిటరేచర్ విభాగంలో 1980వ సంవత్సరం నుంచి అన్నమయ్య సాహిత్యంపై వెలువడిన 99 కొత్త ప్రచురణలు ఉన్నాయి. అదేవిధంగా 1950వ సంవత్సరం నుంచి పలువురు రచించిన పరిమితమైన 29 పాత ప్రచురణలను అందుబాటులో ఉంచారు. లైఫ్ హిస్టరీ విభాగంలో అన్నమయ్య వంశవృక్షం వివరాలు, జననం, బాల్యం, తిరుమల యాత్ర, రచనలు ఇతర పూర్తి జీవిత విశేషాలను భక్తులకు అందుబాటులో ఉంచారు. అన్నమయ్య రాగిరేకులను వెలికితీసిన ఏడుగురు పరిష్కర్తల గురించి తెలియజేశారు.
‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’
తితిదే శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పేరిట 14 వాల్యూమ్‌లలో సిడిలను రూపొందించారు. తితిదే ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రముఖ దర్శకులు శ్రీరాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీ సాయి మధుకర్, శ్రీ సాలూరి వాసూరావు, శ్రీ కె.రామాచారి, శ్రీ నాగ్ శ్రీవత్స, శ్రీ ఎస్‌వి.ఆనందభట్టర్, డా|| జోశ్య భట్ల తదితర ప్రముఖ సంగీత దర్శకుల సారథ్యంలో ఈ సిడిలను రూపొందించారు. ఒక్కో సిడి ధరను రూ.30/-గా నిర్ణయించారు. తిరుమల, తిరుపతిలోని అన్ని తితిదే పుస్తక విక్రయశాలల్లో భక్తులు వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈ సిడిల్లోని సంకీర్తనలను కూడా తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. భక్తులు వీటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.