LAKSHA BILWARCHANA IN SRI KT _ నవంబరు 16న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్షబిల్వార్చన

Tirupati, 9 Nov. 19: The religious event of Laksha Bilwarchana will take place in Sri Kapileswara Swamy temple in Tirupati on November 16.

As a part of this, the presiding deity will be awakened with Suprabhata Seva followed by Abhishekam, Alankaram and Archana at 3am. Later follows Laksha Bilwarchana which will be observed between 6am and 12 noon. The devotees can participate in this seva on the payment of Rs.100 per ticket.

There will be Sarvadarshanam from 6am to 3pm and again from 5.30pm to 8.30pm. In the evening there will be procession of Sri Kamakshi Ammavaru and Sri Kapileswara Swamy in the streets encircling the shrine between 6pm and 8pm.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబరు 16న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్షబిల్వార్చన

నవంబరు 09, తిరుప‌తి, 2019: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 16వ తేదీన లక్ష బిల్వార్చన సేవ వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇందులోభాగంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహిస్తారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ జరుగనుంది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చిస్తారు. ఒక్కొక్క‌రు రూ.100/- టికెట్ కొనుగోలు చేసి ల‌క్ష బిల్వార్చ‌న సేవ‌లో పాల్గొన‌వ‌చ్చు. ఈ సందర్భంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఘనంగా ఊరేగించనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.