“VENKATATTURAIVAR” TAKEN ON A CELESTIAL PROCESSION _ శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం

KAISIKA DWADASI ASTHANAM OBSERVED

 THIS IS THE ONLY DAY UGRA SRINIVASA COMES OUT OF THE TEMPLE

Tirumala, 9 Nov. 19: The idol of Sri Ugra Srinivasa Murthy also known as Venkatatturaivar was taken on a celestial ride along the four mada streets on the auspicious day of Kaisika Dwadasi on Saturday.

Religious fervour marked the celebration of the annual ‘Kaisika Dwadasi’ at the hill shrine of Lord Venkateswara as the devotees were mused with devotion to see the procession of Sri Ugra Srinivasa along with Sridevi and Bhudevi which takes place only on this day in a year. The procession is carried out before the break of dawn between 4.30am and 5.30am.

SIGINIFICANCE

Immense importance is attached to the festival, which according to mythology is revered as one of the most important religious events in the Sri Vaishnava Kshetrams. Legends say that Kaisika Ekadasi arises out of Kaisikapuranam consisting of 82 slokas, which a story is told by Sri Varaha Perumal to Bhoodevi. 

Based on the story of an ardent devotee Sri Nambaduvan, Kaisika Dwadasi attained religious significance.

STORY OF NAMBADUVAN

A great devotee of Lord Sri Nambaduvan(also known as Satyamurthi) being confronted by a Brahma Rakshasa on his way to Nambi temple. This Rakshasa used to be a Brahmin by the name of Soma-Sharma. He committed some grave mistakes during a Yagam and was cursed to become a Brahma Rakshasa.

On Kaisika Ekadasi day, when Nambaduvan was traveling to the temple, a demon stops him to become his prey. After great persuasion, Nambaduvan tells the Rakshasa that he would return to be eaten by him after completing his annual offering of music to Nambi Perumal. The Rakshasa allows him to proceed to the temple. After singing songs in Kaisika Ragam, all night in front of the Lord, Nambaduvan comes back to Rakshasa to fulfill his promise.

At that time, Lord Sri Mahavishnu, to testify the devotion and commitment of Nambaduvan, in the guise of an old man, stops him and asks him to take another route, to escape from becoming prey to the demon. Nambaduvan refuses to break his promise and proceeds to meet his death. The Demon was surprised at his honesty when he sees Nambaduvan coming to him. Later the truthfulness of Nambaduvan impresses Lord who offers him salvation also breaks the curse of Demon.

In Tirumala, only on this day, Sri Venkatatturaivar, is taken out of the temple on a procession and that too before sun rise.  The reason is that in the 14thCentury, there was huge fire accident in Tirumala when there was a procession of Sri Ugra Srinivasa Murthy as soon as the sun rays fell on the idol. Since then the procession is being observed before the sun rise followed by Asthanam. 

ASTHANAM OBSERVED

Later, the priests organised Dwadasi Asthanam to the deities inside the temple. The temple priests read out the story from Kaisika Puranam during the temple court organized at Bangaru Vakili.

TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy and others were also present during procession and asthanam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
ఏడాదికోసారి మాత్ర‌మే ఆల‌యం నుండి వెలుపల‌కు
ఘనంగా  కైశికద్వాదశి ఆస్థానం

 నవంబరు 09, తిరుమల, 2019: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శ‌నివారం సాల‌క‌ట్ల కైశిక ద్వాదశి ఆస్థానం ఘ‌నంగా జ‌రిగింది. ముందుగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఉభయనాంచారులతో కలిసి తిరుమాడ వీధులలో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. ఆనంత‌రం స్వామి, అమ్మ‌వార్ల‌ను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీ మ‌హావిఫ్ణువు స్వ‌రూపంగా భావించే  శ్రీ‌వారి ఆల‌యంలో కైశిక ద్వాద‌శిని ప్ర‌తి ఏటా నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. ఏడాదిలో ఈ ఒక్కరోజు మాత్రమే ఉగ్రశ్రీనివాసమూర్తిని మాడ వీధులలో ఊరేగిస్తారని తెలిపారు. ఈ ఉత్స‌వ నేప‌థ్యంలో స్వామివారికి ప్రాతఃకాలంలో నిర్వ‌హించే సుప్ర‌భాతం, తోమాల, అర్చ‌న సేవ‌ల‌ను ఏకాంతంగా నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. కైశిక ద్వాద‌శి సంద‌ర్భంగా స్వామివారి కృపాక‌టాక్షాలు భ‌క్తులంద‌రిపై ఉండాల‌ని ఆకాంక్షించారు.

ప్రాశ‌స్త్యం..
       
       పురాణాల ప్ర‌కారం శ్రీ‌వైష్ణ‌వ క్షేత్రాల్లో నిర్వ‌హించే ముఖ్య‌మైన ప‌ర్వ‌దినాల్లో కైశిక‌ద్వాద‌శి ఒక‌టి. శ్రీ వ‌రాహ పెరుమాళ్ కైశిక‌పురాణంలోని 82 శ్లోకాల‌తో శ్రీ భూదేవికి క‌థ‌గా చెప్పిన రోజును కైశిక ఏకాద‌శిగా పిలుస్తారు. ఈ క‌థ ఆధారంగా కైశిక ద్వాద‌శి ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.

నంబ‌దువాన్ క‌థ‌…

కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్‌ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెలుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. అందుకు నంబదువాన్‌ సమాధానంగా తాను ప్రస్తుతం శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి అద‌నపు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.