KAPILATEERTHAM REVERBERATES TO “SIVA NAMARCHANA”_ శ్రీకపిలేశ్వరాలయంలో వైభవంగా లక్ష బిల్వార్చన

TIRUPATI, 8 November 2017: The famous Lord Shiva shrine under the aegis of TTD, the Kapileswara Swamy temple, reverberated to the chant of “Siva Namarchana” on Wednesday as a part of “Laksha bilwarchana” conducted on the occasion of Karthika masa homam in the yagashala of the temple.

Earlier the day started with suprabhatam by 3am followed by Abhishekam by 3.30am, Archana by 5am, and the special ritual with one lakh Bilwa leaves which are considered to be highly sacred is carried out by the Saivagama Vedaparayanadars in the temple from 6am to 12 noon.

After the ritual, Maha Naivedyam has been rendered to the presiding deity followed by Swastirachanam and Deeparadhana. In the evening, the procession of utsava murthies took place between 6pm to 8pm.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీకపిలేశ్వరాలయంలో వైభవంగా లక్ష బిల్వార్చన

నవంబరు 08, తిరుపతి, 2017: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం లక్ష బిల్వార్చన సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులోభాగంగా ఉదయం 3.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు. యాగశాల మండపంలో ఉదయం 6.00 నుంచి 12.00 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ వైభవంగా జరిగింది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చించారు. ఈ సందర్భంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పించారు. అదేవిధంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఘనంగా ఊరేగించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ శంకర్‌రాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, ఆలయ అర్చకులు శ్రీ మణిస్వామి, శ్రీ స్వామినాథస్వామి, శ్రీ విజయస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నారాయణ, శ్రీ మురళీకృష్ణ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.