PREPARE FLOOR CLEANING AND BIO MANURES WITH COW PRODUCTS-EO_ గో ఉత్పత్తుల ద్వారా సేంద్రియ ఎరువులు, ఫ్లోర్‌ క్లీనర్‌ తయారీకి ప్రతిపాదనలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 8 November 2017: TTD EO Sri Anil Kumar Singhal on Wednesday directed the officials concerned to come out with an action plan to prepare farm friendly bio manure products out of Panchagavya.

A review meeting on SV Goshala was held in the chambers of TTD EO in administrative building in Tirupati on Wednesday evening.

During the meeting the EO said there are many products including bio manures, floor cleaners are being prepared out of Desi Cow urine, dung etc. “We should come out with such products which are farmers’ friendly. These products should be cost effective yet have a great benefit. Come out with a best plan of action”, he reiterated.

Earlier, the Goshala Director Dr Harinath Reddy explained the EO on the activities of Gosamrakshana Trust and also the improvements taken in the recent times.

Tirupati JEO Sri P Bhaskar, CE Sri Chandrasekhar Reddy, FACAO Sri Balaji, Additional Health Officer Dr Sunil were also present


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
గో ఉత్పత్తుల ద్వారా సేంద్రియ ఎరువులు, ఫ్లోర్‌ క్లీనర్‌ తయారీకి ప్రతిపాదనలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

నవంబరు 08, తిరుపతి, 2017: గో ఉత్పత్తుల ద్వారా రైతులు పంటలు సాగు చేసేందుకు సేంద్రియ ఎరువులు, గృహాలు శుభ్రం చేసుకునేందుకు ఫ్లోర్‌క్లీనర్‌ తయారీ కోసం ప్రతిపాదనలు రూపొందించాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల ఈవో కార్యాలయంలో బుధవారం ఎస్వీ గోసంరక్షణ ట్రస్టు కార్యకలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గోవు ఎంతో శ్రేష్టమైనదని, గోమూత్రం, పేడతో తయారయ్యే ఉత్పత్తుల ద్వారా రైతులకు ఆర్థికంగా తోడ్పాటు లభిస్తుందని తెలిపారు. బయోమెన్యూర్‌(సేంద్రియ ఎరువు), గో నైల్‌(ఫ్లోర్‌క్లీనర్‌) ఉత్పత్తులను ఎలా తయారుచేయాలి, రైతులకు, ప్రజలకు ఎలా అందించాలి, నాణ్యత, మార్కెటింగ్‌ తదితర విషయాలపై 15 రోజుల్లో ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ఈ ఉత్పత్తులు ప్రజలకు చక్కగా ఉపయోగపడాలని, టిటిడికి ఆర్థికంగా భారం కాకుండా ఉండేలా ప్రతిపాదనలు తీసుకురావాలన్నారు. అనంతరం ట్రస్టు కార్యకలాపాలను సమీక్షించారు. ఆ తరువాత ఎస్వీ గోశాల సంచాలకులు డా||హరనాథరెడ్డి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఇటీవల గోసంరక్షణకు తీసుకున్న చర్యలు, భవిష్యత్‌ ప్రణాళికలను వివరించారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఎఫ్‌ఏ, సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు ఆరోగ్యశాఖాధికారి డా|| సునీల్‌, ఎస్వీ గోశాల అధికారులు డా|| డిఎన్‌.రాజ్‌, డా|| నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.