LAKSHA KUMKUARCHANA AT SRI PAT ON NOV 22 _ నవంబరు 22న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన

Tirupati, 16 Nov. 19: As part of annual Karthika Brahmotsavams of Sri Padmavathi Ammavari temple, Tiruchanoor ,laksha kumkumarchana will be grandly performed on Friday,November 22.

Interested couple could participate in the holy event with ₹1116 ticket and beget one uttarium. One blouse,two laddus and blessings. Tickets would be sold at current booking counters on first come first served basis.

KAT ON NOVEMBER 19

In view of Brahmotsavams,TTD plans to perform Koil Alwar Thirumanjanam on November 19. TTD has cancelled all arjita sevas for the day.

Details of vahana sevas of Brahmotsavams .

                         MORNING                                EVENING

23-11-2019: Dwajarohanam                  Chinna Sesha Vahanam

24-11-2019: Pedda Sesha Vahanam        Hamsa Vahanam

25-11-2019: Muthyapu Pandari Vahanam   Simha Vahanam

26-11-2019: Kalpavruksha Vahanam           Hanumantha Vahanam

27-11-2019: Pallaki utsavam                     Gaja Vahanam

28-11-2019: Sarvabhoopala Vahanam, Swarna ratham Garuda Vahanam 
29-11-2019: Suryaprabha Vahanam        Chandraprabha Vahanam

30-11-2019: Rathotsavam                      Aswa Vahanam

01-12-2019: Panchami theertham            Dwaja Avarohanam

02-12-2019:                                       Pushpa Yagam

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

 

నవంబరు 22న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన

 తిరుపతి, 2019 నవంబరు  16: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబరు 22వ తేదీ శుక్రవారం ఆలయంలో లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వహించనున్నారు.

ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవర్లను శ్రీకృష్ణస్వామి ముఖ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.1,116/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి లక్ష కుంకుమార్చన సేవలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, రెండు లడ్లు, రెండు వడలు బహుమానంగా అందజేస్తారు. ఆలయం వద్దగల కౌంటర్‌లో కరంట్‌ బుకింగ్‌లో భక్తులు ఈ టికెట్లు పొందొచ్చు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తారు.

న‌వంబ‌రు 22న అంకురార్ప‌ణ
     
న‌వంబ‌రు 22వ తేదీ సాయంత్రం 6.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు.

న‌వంబ‌రు 19న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
 
శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో న‌వంబ‌రు 19వ తేదీ మంగ‌ళ‌వారం  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌న, శుద్ధి నిర్వహిస్తారు.
 
అనంతరం ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ కార‌ణంగా కుంకుమార్చ‌న‌తోపాటు ఆల‌యంలో అన్ని ఆర్జిత‌సేవ‌ల‌ను ర‌ద్దు చేశారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                                     ఉదయం                                       రాత్రి

23-11-2019(శనివారం)      ధ్వజారోహణం                           చిన్నశేషవాహనం

24-11-2019(ఆదివారం)   పెద్దశేషవాహనం                       హంసవాహనం

25-11-2019(సోమవారం)   ముత్యపుపందిరి వాహనం              సింహవాహనం

26-11-2019(మంగళవారం)  కల్పవృక్ష వాహనం                     హనుమంతవాహనం

27-11-2019(బుధవారం)   పల్లకీ ఉత్సవం                                    గజవాహనం

28-11-2019(గురువారం)    సర్వభూపాలవాహనం       స్వర్ణరథం, గరుడవాహనం

29-11-2019(శుక్రవారం)    సూర్యప్రభ వాహనం                    చంద్రప్రభ వాహనం

30-11-2019(శనివారం)        రథోత్సవం                                   అశ్వ వాహనం

01-12-2019(ఆదివారం)     పంచమితీర్థం                                   ధ్వజావరోహణం.

 02-12-2019(సోమవారం)                ——-     సాయంత్రం – పుష్పయాగం.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.