LAKSHA KUMKUMARCHANA AT SRI KT ON AUG 30_ ఆగ‌స్టు 30న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

Tirupati, 26 Aug. 19: TTD proposes to perform Laksha Kumkuarchana for Goddess Kamakshi at Sri Kapileswara temple on August 30.

Interested devotees could participate with ₹200 ticket for two persons and beget one Laddu m kumkuma prasadam.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగ‌స్టు 30న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

తిరుపతి, 2019 ఆగ‌స్టు 26: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆగ‌స్టు 30వ తేదీన శ్రీ కామాక్షి అమ్మవారికి ఘనంగా లక్ష కుంకుమార్చన నిర్వహించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

ఇందులో భాగంగా ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.00 గంట‌ల వ‌ర‌కు శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు పురవీధుల్లో ఊరేగి భక్తులను క‌టాక్షించ‌నున్నారు.

రూ.200/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) లక్ష కుంకుమార్చన సేవ‌లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ల‌డ్డూ, కుంకుమ ప్ర‌సాదంగా అందజేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.