TTD CANCELS DONOR PRIVILAGES AHEAD OF ANNUAL BRAHMOTSAVAMS_ శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మూత్సవాలలో దాతలకు కల్పించే ప్రత్యేక దర్శనాలు, గదుల కేటాయింపు రద్దు

Tirumala, 26 Aug. 19: TTD today announced that from September 28-October 10 all the break darshan and room allotments to donors of all trusts and projects of TTD stands cancelled in view of annual Brahmotsavams of Srivari temple.

TTD has taken such a decision to cancel all break darshan, and accommodations, etc. from two days ahead of the festival and also two days later in order to facilitate a large number of devotees.

Similarly, from September 29, day of Ankurarpanam till October 8, all special darshan for elders, challenged persons, and parents with one-year-old infants via the Supatham Stood cancelled.

TTD has appealed to all the donors to take note of the changes and cooperate.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మూత్సవాలలో దాతలకు కల్పించే ప్రత్యేక దర్శనాలు, గదుల కేటాయింపు రద్దు

తిరుమల, 2019 ఆగ‌స్టు 26: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మూత్సవాల నేపథ్యంలో సెప్టెంబ‌రు 28 నుండి అక్టోబ‌రు 10వ తేదీ వరకు టిటిడిలోని వివిధ‌ ట్రస్టులకు, ప‌థ‌కాల‌కు విరాళాలు అందించిన దాతలకు కల్పించే ప్రత్యేక దర్శనాలు, వారికి కేటాయించే గదులను టిటిడి రద్దు చేసింది.

శ్రీవారి బ్రహ్మూత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా విచ్చేస్తారు. వారికి సంతృప్తికరంగా దర్శనం, వసతి కల్పించేందుకు టిటిడి ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా బ్ర‌హ్మోత్స‌వాలకు రెండు రోజుల ముందు నుండి, ముగిసిన త‌రువాత రెండు రోజుల వ‌ర‌కు దాతలకు కల్పించే బ్రేక్‌ దర్శనాలు, సుపథం గుండా కల్పించే ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది.

అదేవిధంగా, సెప్టెంబ‌రు 29(అంకురార్పణం) నుండి అక్టోబ‌రు 8వ తేదీ వరకు వయోవృద్ధులు, దివ్యాంగులు, ఒక సం||లోపు చిన్నపిల్లల తల్లిదండ్రులకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది. భక్తులు, దాతలు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోర‌డ‌మైన‌ది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.