LAKSHA KUMKUMARCHANA IN SRI KT ON AUGUST 18_ ఆగస్టు 18న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

Tirupati, 12 August 2017: The Laksha Kumkumarchana religious fete will be observed in the famous shrine of Sri Kapileswara Swamy in Tirupati on August 18.

After Vighneswara Puja, Punyahavachanam and Sankalpam, the first phase Kumkumarchana will be performed between 8:30am and 11:30am followed by Naivedyam and Harati. Again the second phase of the religious event will be observed between 4pm and 6pm. After wards there will be procession of Sri Somaskandamurthy and Sri Kamakshi Devi in the mada streets.

The Grihasta pilgrims who are willing to take part in this fete should pay Rs.200 for which two persons will be allowed.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆగస్టు 18న శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన

ఆగస్టు 12, తిరుపతి, 2017 : టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారికి ఆగస్టు 18వ తేదీన లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఉదయం విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, సంకల్పంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి విడత కుంకుమార్చన నిర్వహిస్తారు. ఆ తరువాత నైవేద్యం, హారతి ఉంటుంది. తిరిగి సాయంత్రం 4.00 నుంచి 6.00 గంటల వరకు రెండో విడత కుంకుమార్చన జరుగనుంది. అనంతరం నివేదన, దీపారాధన, హారతి, తీర్థప్రసాద వినియోగం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.00 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగిస్తారు.

గహస్తులు(ఇద్దరు) రూ.200/- చెల్లించి కుంకుమార్చన సేవలో పాల్గొనవచ్చు. గ హస్తులకు ఒక లడ్డూ, కుంకుమ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.