LAKSHA KUMKUMARCHANA PERFORMED_ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా లక్షకుంకుమార్చన

Tiruchanoor, 14 November 2017: Laksha Kumkumarchana’ was performed on a grand note at Sri Padmavathi Devi temple in Tiruchanur on Tuesday.The ritual is performed before the commencement of mega religious event of nine day ‘Kartheeka Brahmotsavams’ which is set to commence from Wednesday onwards.

The ritual began at 8 a.m. and concluded at 12 noon at the Mukha Mandapam located opposite Sri Krishna Swamy temple , where the processional deity of goddess Padmavathi was seated on ‘asan’. The priests chanted the 1000 divine names of Goddess for ten times during this fete.
TTD EO Sri Anil Kumar Singhal, Tirupati JEO Sri Pola Bhaskar, TTD Temple Special Grade Deputy EO Sri Munirathnam Reddy and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా లక్షకుంకుమార్చన

తిరుపతి, 2017 నవంబరు 14: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది.

హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి అమ్మవార్ల పేర్లతో పిలవబడుతున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు.

ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మి అష్టోత్తరం, లక్ష్మి సహస్రనామాలను వళ్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.