CULTURAL ROAD SHOW AT SRI PAT BRAHMOTSAVAMS_ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సాంస్కృతిక శోభ
Tirupati, 14 November 2017: the nine day celestial festival of Sri Padmavathi Ammavari Brahmotsavams at Tiruchanur beginning tomorrow will become a showcase of dharmic, devotional and cultural feast for nine days. They will be organised by the HDPP, Annamacharya project, Dasa Sahitya project, SV College of Dance and Music and Alwar Divya Prabhanda projects of the TTD.
As part of the devotional event programs by renowned artists of the TTD wings will be held at the Asthana Mandapam at Tiruchanoor, (5AM to 7.30AM) Annamayya Kalamandir, Mahati auditorium and Shilparamam at Tirupati (6.00 -8.30 PM) every day.
TTD has roped in bhakti sangeet, discourses, folk arts, classical dancers etc from all over the state to perform at all these venues daily to enthrall the music and dance lovers of the temple town and also devotees who came all over country to participate in the celestial Brahmotsavam of Sri PAT.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సాంస్కృతిక శోభ
తిరుపతి, 2017 నవంబరు 14: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి, తిరుచానూరులలో ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు మరింత శోభను చేకుర్చనున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు 9 రోజుల పాటు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా తిరుచానూరు ఆస్థాన మండపంలో ఉదయం 5.30 నుండి రాత్రి 7.00 గంటల వరకు, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, మహతీ కళాక్షేత్రం, శిల్పారామంలో సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.30 గంటల వరకు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా నవంబరు 15వ తేదీ బుధవారం తిరుచానురులోని ఆస్థానమండపంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు ఎస్.వి.సంగీత కళాశాల వారిచే మంగళధ్వని, శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాల ఆధ్వర్యంలో ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు వేద పారాయణం నిర్వహించనున్నారు. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు నెల్లూరుకు చెందిన శ్రీ కె.ఎస్.రామానుజం గారిచే ధార్మికోపన్యాసం, ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీ జి.చంద్రశేఖర్‌రావు భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అనంతరం కోలార్‌కు చెందిన శ్రీమతి ఎస్.మంజుల బృందంచే మధ్యాహ్నం 3.00 నుండి 4.30 గంటల వరకు హరికథ, సాయంత్రం 4.30 నుండి రాత్రి 7.00 గంటల వరకు ఎస్.వి.సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులచే అన్నమయ్య విన్నపాలు, ఊంజల్ సేవలో సంకీర్తనాలాపన చేస్తారు.
అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు ఉడిపికి చెందిన సిద్ధి వినాయక యక్షగాన కళాకేంద్రం వారిచే యక్షగాన కార్యక్రమం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు బెంగళూరుకు చెందిన శ్రీ పావని కాశీనాథ్ బృందం భక్తి సంగీతం, రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీ నృత్యపిళ్ళై బృందంచే నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరునల్వేలికి చెందిన శ్రీచిత్ర గోపినాథ్ బృందంచే నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.