LAKSHMI NARASIMHA SWAMY BTUs AT TARIGONDA FROM MARCH 20 TO 28 _ మార్చి 20 నుండి 28వ తేదీ వరకు ఏకాంతంగా తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirupati, 17 Mar. 21: The annual brahmotsavams in the ancient temple of Sri Lakshmi Narasimha Swamy at Tarigonda in Chittoor district will be observed from March 20 to 28 with Ankurarpanam on March 29.
The important days includes Dhwajarohanam on March 20, Kalyanotsavam and Garuda Seva on March 25, Rathotsavam on March 26, Vasanthotsavam, Chakrasnanam, Dhwjavarohanam on March 28.
Kalyanotsavam will be observed between 7pm and 9pm. While Pushpayagam will be performed on March 29 between 5pm and 7pm.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మార్చి 20 నుండి 28వ తేదీ వరకు ఏకాంతంగా తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2021 మార్చి 17: తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో మార్చి 20 నుండి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. మార్చి 19వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
20-03-2021(శనివారం) ధ్వజారోహణం హంసవాహనం,
21-03-2021(ఆదివారం) ముత్యపుపందిరి వాహనం హనుమంత వాహనం
22-03-2021(సోమవారం) కల్పవృక్ష వాహనం సింహ వాహనం
23-03-2021(మంగళవారం) తిరుచ్చి ఉత్సవం పెద్దశేష వాహనం
24-03-2021(బుధవారం) తిరుచ్చి ఉత్సవం గజవాహనం
25-03-2021(గురువారం) తిరుచ్చి ఉత్సవం సర్వభూపాల వాహనం, కల్యాణోత్సవం, గరుడ వాహనం
26-03-2021(శుక్రవారం) రథోత్సవం ధూళి ఉత్సవం
27-03-2021(శనివారం) సూర్యప్రభవాహనం చంద్రప్రభ వాహనం, పార్వేట ఉత్సవం,అశ్వ వాహనం
28-03-2021(ఆదివారం) వసంతోత్సవం, చక్రస్నానం ధ్వజావరోహణం
కాగా, మార్చి 25వ తేదీ రాత్రి 7 నుండి 9 గంటల వరకు కల్యాణోత్సవం ఏకాంతంగా జరుగనుంది. అదేవిధంగా మార్చి 29వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 7 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.