LAUDABLE EFFORTS OF “SRAVANAM” MAKES DEAF AND DUMB CHILDREN AUDIBLE_ ‘శ్రవణం’ వినికిడి లోపం చిన్నారులకు వరం తెలుగు రాష్ట్రాల్లో 244 మంది పిల్లలకు శిక్షణ పూర్తి

TTD’S SRAVANAM-BOON TO DEAF AND DUMB INFANTS

THE UNIQUE PROJECT OF TTD GAINS POPULARITY ACROSS AP AND TS

Tirupati 26 July 2017: Strenuous attempts by Tirumala Tirupati Devasthanams (TTD) have made its unique project ‘Sravanam’ to reach out many deaf and dumb infants and today it has become a boon in the lives of such differently abled children across twin Telugu states.

11-YEAR OLD ‘SRAVANAM’

Started in the year 2006 on December 15 with just 15 infants and two trained faculty by the then Executive Officer of TTD Sri APVN Sharma with the support of Bala Vidyalaya Director Smt Saraswathi from Chennai, today there are 175 children and 31 faculties in this unique project. So far in the past 11 years, about 244 children who underwent training in this project are now leading a normal life along with other children in both the Telugu speaking states.

CMO’s CONTROL

Sravanam Project functions under the control of The Chief Medical Officer of TTD. According to CMO Dr D Nageswara Rao, the management of TTD is contemplating to strengthen the Project to give enhanced training to children. “Our chief aim is to give a new lease of life to these specially abled children and lead a normal life along with other children. We conduct all sorts of recreational activities, competitions to encourage them during special occasions like Flag Day, Children’s Day, annual day etc. and they excel showcasing their talents”, he added.

A SUB-CENTRE IN VIZAG:

Seeing the overwhelming response from the parents who have hearing impaired children, TTD has extended its wing and started one more sub-centre at Visakhapatnam on June 1 during last year. At present, about 30 children, who are aged below three years are undergoing training here.

TTD DEPLOYED DTYHI TEACHERS

To train the infants with hearing and speech deficiencies, TTD has employed teachers who were specialised in this area with a qualification of Diploma in Teaching Young Hearing Impaired (DTYHI). They train the children in Development of Hearing Voice and Natural Integration (DHVANI) in sound proof classes. The children undergo training in a pleasant environment and 57 dedicated non-teaching staff also takes care of these children.

PARENTS TOO GET TRAINING

To enable a positive environment surrounding these specially abled children, the teachers also train their parents in sound therapy. TTD also provides boarding and lodging to the parents too during the training period of their children. There are about 100 hostellers and 30 day scholars in Sravanam Project. Each faculty will be allotted with four students alone for better training.

ZERO TO THREE YEARS

The child whose deaf and dumbness identified from the day he or she was born till three years get admission into this unique project. The admission is free. The parents with family photo and Aadhaar card shall directly approach the Sravanam Institution located in old Maternity Hospital located in Sarojini Devi road in Tirupati. For any information the phone numbers 0877-2264290,4644 and 4443 can be contacted.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

‘శ్రవణం’ వినికిడి లోపం చిన్నారులకు వరం తెలుగు రాష్ట్రాల్లో 244 మంది పిల్లలకు శిక్షణ పూర్తి

తిరుపతి, 2017 జూలై 26: మాటలు రాని మూడేళ్ల వయసులోపు గల చిన్నారులకు మాటలతోపాటు విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్తులో వారు సాధారణ పిల్లల్లాగా కొనసాగేందుకు శ్రీవేంకటేశ్వర శ్రవణం సంస్థ కృషి చేస్తోంది. వినికిడి లోపం చిన్నారులకు ఆధునిక పద్ధతుల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిలో భాషాభివృద్ధి చేస్తోంది. పిల్లలకు ఒక సంవత్సరం వచ్చేలోపు వినికిడి లోపాలను గుర్తించి శిక్షణ ఇవ్వగలిగితే 3 లేదా 4 సంవత్సరాల్లో మాటలు నేర్పి భాషాభివృద్ధి తీసుకురావచ్చని ఆధునిక శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

వినికిడి లోపాన్ని ఎలా గుర్తించాలి :

పిల్లలకు వినిపించడం లేదు అన్న సందేహం కలిగినపుడు, ఒక సంవత్సరం పైబడినా మాట్లాడలేకపోతున్నపుడు వినికిడిలోపం ఉందని గుర్తించాలి.

తిరుపతిలో ప్రధాన కేంద్రం :

2006, డిసెంబరు 15న అప్పటి టిటిడి ఈవో శ్రీ ఎపివిఎన్‌.శర్మ ఆధ్వర్యంలో, చెన్నైలోని బాలవిద్యాలయ డైరెక్టర్‌ శ్రీమతి సరస్వతి నారాయణస్వామి సహకారంతో తిరుపతిలో శ్రవణం సంస్థ ప్రారంభమైంది. కేవలం 15 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులతో ప్రారంభమైన శ్రవణంలో ప్రస్తుతం 175 మంది చిన్నారులు, 31 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. టిటిడి ముఖ్య వైద్యాధికారి పర్యవేక్షణలో ఉన్న శ్రవణంలో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 244 మంది చిన్నారులకు వినికిడి లోపాన్ని సరిచేసి సాధారణ విద్యార్థుల్లా మార్చారు.

విశాఖపట్టణంలో ఉప కేంద్రం :

శ్రవణం సంస్థ విస్తరణలో భాగంగా 2016, జూన్‌ 1న విశాఖపట్టణంలో ఉపకేంద్రాన్ని టిటిడి ప్రారంభించింది. ప్రస్తుతం ఇక్కడ 30 మంది చిన్నారులు శిక్షణ పొందుతున్నారు.

టిటిడి అందిస్తున్న సౌకర్యాలు :

చిన్నారులకు ఆధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించి వినికిడి సామర్థ్యాన్ని నిర్ధారిస్తారు. రెండు చెవులకు తగిన వినికిడి యంత్రాలను అమర్చుతారు. డిటివైహెచ్‌ఐ(డిప్లొమా ఇన్‌ టీచింగ్‌ యంగ్‌ హియరింగ్‌ ఇంపేర్డ్‌) అనే ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో శిక్షణ ఇస్తారు. డిహెచ్‌విఎఎన్‌ఐ(డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హియరింగ్‌ వాయిస్‌ అండ్‌ నేచురల్‌ ఇంటిగ్రేషన్‌) అనే ప్రత్యేక బోధనా పద్ధతి ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తిరుపతి కేంద్రంలో చిన్నారులకు సేవలందించేందుకు అంకితభావం గల 57 మంది సిబ్బంది ఉన్నారు. విశాలమైన, ఆహ్లాదకరమైన సౌండ్‌ ప్రూఫ్‌ తరగతి గదులలో శిక్షణ ఇచ్చి భాషతోపాటు విద్యను బోధిస్తారు. బిడ్డకు, తల్లి లేదా సంరక్షకురాలికి హాస్టల్‌, భోజనం, వైద్యసౌకర్యాలు కల్పిస్తారు. చదువురాని తల్లులకు చదువు నేర్పిస్తారు. ఒక్కో తరగతి గదిలో గరిష్టంగా నలుగురు విద్యార్థులకు మాత్రమే బోధిస్తారు. అవసరాన్ని బట్టి ఒక్క విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న పిల్లలు వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం, లెక్కలు చేయడం మొదలైన వాటిలో నైపుణ్యం పొందుతారు.

అడ్మిషన్‌ పొందడమెలా? :

పిల్లలకు 0-3 సం||లోపు వయసు ఉండాలి. సంవత్సరం పొడవునా శ్రవణంలో ఉచితంగా అడ్మిషన్లు పొందవచ్చు. అప్పుడే పుట్టిన శిశువును కూడా చేర్చుకుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో నేరుగా తిరుపతిలోని సరోజినీ దేవి రోడ్డులో గల పాత మెటర్నిటీ ఆసుపత్రి ప్రాంగణంలోని శ్రవణం సంస్థను సంప్రదించాలి. అదేవిధంగా 0877-2264290, 2264644, 2264443 నంబర్లకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ కుటుంబ ఫొటో, ఆధార్‌కార్డు, చిరునామా గుర్తింపు కార్డులను తీసుకురావాల్సి ఉంటుంది.

శ్రవణం కేంద్రం అభివృద్ధికి ప్రణాళికలు : సిఎంవో డా|| నాగేశ్వరరావు

వినికిడి లోపం గల చిన్నారులకు మరింత మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు, శ్రవణం కేంద్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని టిటిడి ముఖ్య వైద్యాధికారి డా|| డి.నాగేశ్వరరావు తెలిపారు. వినికిడి లోపం గల చిన్నారులకు సంవత్సరం పొడవునా అడ్మిషన్లు కల్పిస్తామన్నారు. శ్రవణం కేంద్రంలో నిర్వహించే వార్షికోత్సవం, బాలల దినోత్సవం, గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల్లో చిన్నారులను ప్రోత్సహించేలా పలురకాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.