LAUNCH OF PANCHAGAVYA TREATMENT IN AYURVEDA HOSPITAL FROM APRIL 3- TTD EO _ ఏప్రిల్ 3న పంచగవ్య ఔషదాలతో చికిత్స కేంద్రం ప్రారంభం

–       INTERNALLY GENERATE MILK, GHEE FOR TTD NEEDS 

-SET UP GHEE PRODUCTION CENTRE AND DESI COW REARING 

Tirupati, 18 Mar. 22: TTD EO Dr KS Jawahar Reddy directed officials to launch treatment with Pancha Gavya products at Ayurveda hospital from April 3 both OP and 12-bed inpatient ward

Addressing a review meeting on Pancha gavya products with officials at the Sri Padmavati rest house the TTD EO to make arrangements for the production of 3000 litres of milk and 60 kgs of ghee needed daily for use in Srivari temple.

TTD EO said the official team should immediately take steps to procure desi bovine across the country and measures for building to set up Ghee production Centre in the Goshala.

The ghee and milk generated should also be utilised in the Anna Prasadam complex.

He said through the Rythu Sadhikara organisation TTD has so far distributed freely 1300 cows and bulls to farmers in Chittoor, Nellore, Prakasam and Anantapur districts.

Among others, he directed officials t speedup training program for Goshala organisers in collaboration with ISKCON for the promotion of Organic products and Go Samrakshana.

He also urged officials to promote research to high-quality standards in Pancha Gavya products.

GEO FENCING FOR EVERY TTD PROPERTY

TTD EO directed the estate officials to organise Geo fencing and geo-mapping for each and every TTD assets to protect it from encroachments. The representatives of Hyderabad based NIR interactive Company presented a demo of their product. TTD EO said a decision will be made after a scrutiny of the Geo fencing done for properties of other organisations

Additional EO Sri AV Dharma Reddy, TTD JEOs Sri Veerabrahmam, Smt Sada Bhargavi CVSO Sri Gopinath Jatti, FA  &CAO Sri Balaji, CE Sri Nageswara Rao, SE Sri Jagadiswar Reddy, Estate officer Sri Mallikarjun, Ayurveda college principal Sri Murali Krishna were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 3న పంచగవ్య ఔషదాలతో చికిత్స కేంద్రం ప్రారంభం

– గోశాలలో నెయ్యి తయారీ కేంద్రం ఏర్పాటు

టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

తిరుపతి 18 మార్చి 20 22: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద ఆసుపత్రిలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పంచగవ్య ఔషధాలతో చికిత్స అందించేలా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

టిటిడికి రోజువారీగా అవసరమయ్యే 3 వేల లీటర్ల పాలు, 60 కిలోల నెయ్యి సొంతంగా ఉత్పత్తి చేసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు.
తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం సాయంత్రం గోసంరక్షణ, పంచగవ్య ఉత్పత్తుల తయారీ, టీటీడీ ఆస్తులకు జియో ఫెన్సింగ్ అంశాలపై ఈవో అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, దేశవాళీ ఆవుల సేకరణకు అధికారుల బృందం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి గోశాలలో నెయ్యి తయారీ కేంద్రం ఏర్పాటు చేయడానికి భవన నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఇక్కడ తయారయ్యే పాలు, పెరుగు తిరుమలలోని అన్నదానం కాంప్లెక్స్ కు పంపాలన్నారు. రైతు సాధికార సంస్థ ద్వారా గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ఇప్పటిదాకా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో రైతులకు 1300 కు పైగా ఆవులు, ఎద్దులు ఉచితంగా ఇచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని గోశాలల నిర్వాహకులకు గో ఆధారిత ఉత్పత్తుల తయారీ, గోసంరక్షణ అంశాలపై ఇస్కాన్ సహకారంతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని గో శాలలు స్వయం సంవృద్ధిగా తయారయ్యేందుకు అవసరమైన అంశాలు శిక్షణలో ఉండాలని ఈవో చెప్పారు.

తిరుపతిలోని ఆయుర్వేద వైద్యశాలలో పంచగవ్య ఔషధాలతో చికిత్సాలయం ఓపి, 12 పడకలతో ఇన్ పేషెంట్ విభాగం ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంచగవ్య ఉత్పత్తుల్లో నాణ్యత ప్రమాణాలు స్థిరీకరించడం కోసం పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి ఆస్తికి జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి

దేశవ్యాప్తంగా టీటీడీ కి ఉన్న ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి ఆస్తికి జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఈవో ఎస్టేట్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కు చెందిన నీర్ ఇంటరాక్టివ్ సంస్థ ప్రతినిధులు జియో ఫెన్సింగ్ ఏర్పాటుపై డెమో చూపించారు. ఇది వరకే జియో ఫెన్సింగ్ చేసిన ఇతర సంస్థల ఆస్తుల భద్రతను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఈవో తెలిపారు.

అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, ఎఫ్ ఏ సి ఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు,
ఎస్ ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ మల్లిఖార్జున, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది