LEGENDS GLORIFY THE LOVE, ENGAGEMENT AND MARRIAGE OF DIVINE COUPLE PADMAVATHI-VENKATESWARA_ పద్మావతిశ్రీనివాసుల కల్యాణం

Tiruchanur, 16 November 2017: There are many interesting stories by many Puranas making rounds in the pilgrim circles about the wedding of divine couple Padmavathi-Venkateswara.

As per the legend, Lord Venkateswara happened to meet Goddess Padmavathi Devi first in Narayana Vanam. Hence this area became popular as “Narayana Varam” since the Goddess expressed Her love to Lord.

The two got engaged in Kayampeta and reached Yogimallavaram to offer prayers to Lord Shiva who is being offered prayers here as Parasareshwara Swamy. Overwhelmed with joy after being engaged to Goddess, Lord reached Appalayagunta and became popular as “Prasanna Venkateswara Swamy”.

Later both the Goddess and Lord reached Srinivasa Mangapuram via Tondavada Agastheswara temple in Chandragiri and married each other. Hence Srinivasa Mangapuram became next to Tirumala with the presiding deity being “Sri Kalyana Venkateswara Swamy” who is considered most auspicious for the newly wed couples.

After residing in the Sage Bharadwaja Ashram here for six month, both Lord and Goddess left for Tirumala through the footpath route located in the lush green forests of Seshachala ranges. Hence this footpath became popular as “Srivari Mettu” since it was trekked by none other than the divine couple themselves.

Other than Tiruchanoor, the temples for Goddess Padmavathi Devi are located in Naryanavanam and Nagalapuram also.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూెత్సవాల ప్రత్యేకవ్యాసం -5

పద్మావతిశ్రీనివాసుల కల్యాణం

నవంబరు 16, తిరుపతి, 2017: స్వర్ణముఖి నదీతీరంలో శ్రీవేంకటేశ్వరుని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శ్రీపద్మావతి అమ్మవారు పూర్వజన్మలో తన తండ్రిగారైన ఆకాశరాజు ఉన్న విజ్వలాపురానికి(విజయపురం) చేరుకున్నారు. శ్రీనివాసుడు అక్కడికి చేరుకుని అమ్మవారిని నారాయణవనంలో చూశారు. అమ్మవారు ప్రసన్నమై స్వామివారికి వరం ఇచ్చారు. కావున ఇది నారాయణవరం అయింది. అక్కడినుంచి కాయంపేటలో స్వామి, అమ్మవార్ల నిశ్చితార్థం జరిగి వివాహం ఖాయమైంది. ఆ పక్కనే ఉన్న మునులపూడి(ముళ్లపూడి) మీదుగా యోగులు ఉన్న యోగిమల్లవరంలోని శ్రీపరాశరేశ్వరస్వామివారిని పద్మావతిశ్రీనివాసులు దర్శించుకున్నారు. నిశ్చితార్థంతో స్వామివారు ప్రసన్నుడై అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్నవేంకటేశ్వరుడయ్యారు. అక్కడినుంచి తొండవాడలోని శ్రీ అగస్తీశ్వరస్వామివారిని దర్శించి శ్రీనివాసమంగాపురానికి చేరుకున్నారు. అక్కడ స్వామి, అమ్మవార్ల కల్యాణం జరగడంతో శ్రీ కల్యాణవేంకటేశ్వరుడయ్యారు. ఆ తరువాత అక్కడే ఉన్న భారధ్వాజ ఆశ్రమంలో ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం స్వామివారు అమ్మవారితో కలిసి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడుచుకుంటూ తిరుమలకు వెళ్లారు. శ్రీపద్మావతి అమ్మవారిని హ దయంలో ఉంచుకుని హ దయలక్ష్మిగా స్థానం కల్పించారు.

నాగలాపురం

శ్రీపద్మావతి అమ్మవారి ఆలయాన్ని అనుసరించి శ్రీవైఖానస ఆగమాన్ని పాటించే ఆలయాల్లో కొన్నిచోట్ల శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలున్నాయి. నాగలాపురంలో మత్స్యావతారంలో శ్రీవేదనారాయణస్వామివారు కొలువై ఉన్నారు. ద్వాపరయుగంలో నాగలాపురం వరకు సముద్రం ఉండేదని, కలియుగానికి ముందు ప్రళయం వచ్చినపుడు సముద్రం కుంచించుకుపోయిందని, ఆ సమయంలో వేదాలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో ఆవిర్భవించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. నాగలాపురంలోని శ్రీవేదనారాయణస్వామివారి ఆలయంలో శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం ఉంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.