LET US ALL UNITE TO GLORIFY THE GLOBE WITH HINDU SANATANA DHARMA-PONTIFFS _ హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు పీఠాధిపతులందరూ ఏకం కావాలి- ధార్మిక సదస్సులో రెండో రోజు ఉదయం స్వామీజీల అనుగ్రహ భాషణం

TIRUMALA, 04 FEBRUARY 2024: The Pontiffs and Hindu religious heads of various Peethams and Mutts have unanimously advocated that it is not alone the country but the entire world needs to be glorified with a devotional wave to overcome all the difficulties which is possible only through the propagation of Hindu Sanatana Dharma.

 

The Peethadhipathis and Chiefs of various like-minded Hindu religious organisations who graced the second day of the ongoing Dharmika Sadas have given valuable suggestions to TTD on how to take forward Hindu Sanatana Dharma through their messages. 

 

VEDURUPAKA SWAMIJI- VIJAYADURGA PEETHAM

 

Both the TTD Chairman Sri Karunakara Reddy and EO Sri AV Dharma Reddy have been doing countless efforts for the development of Srivari Temple adopting more pilgrim-friendly methods and taking forward many religious activities. 

In the last five years, many facilities have been provided to common devotees in Tirumala with the focus being laid giving priority to common devotees which is a welcoming aspect. I wish that this duo should continue in their positions in future too, and perform more dharmic programs.

 

SRI MUKUNDANANDA MAHARAJ- JYOTIR MUTT UTTARAKHAND

 

Sanatana dharma means that not just humans alone but also cattle, plants and animals should be equally treated in a proper manner. TTD should move ahead in that direction and promote Gomata as Vishwa Mata. In modern education, we should taught the children about our traditional Hindu Dharma and cultural values.

   

SRI MANNAR GUDI JIYAR SWAMY

 

TTD should strive hard to prevent conversions in remote areas. TTD should work for the propagation of Hinduism and cow protection all over the world.  Medical and educational institutions should be expanded.

 

SRI SUJAYANIDHITHEERTHA, SRI PADARAYA MUTT

 

Thanks to the officials who are doing this program. Tirumala Tirupati Devasthanam is in a unique position in India.  Respecting the values of Sanatana Dharma should commence at every individual home first.

 

SRI VIDYANANDA SWAMY, KANNYUR MUTT, UDIPI

 

TTD brought together the sadhus in India and undertook such a great work of reviving Hindu Sanatana Dharma taking forward its values to the nook and corner of the country. Any effort to uphold our traditional Hindu dharma should be happy and such programs should be organized in a vibrant manner.  Gudiko Gomata program is well appreciated.

 

SRI ANUPAMANANDA MAHARAJ, RAMAKRISHNA MUTT

 

More and better efforts should be made to pass on dharma to the future generations.  The interest of the youth towards Dharmacharana needs to be developed.  Sanskrit language should be encouraged.  Due to this, the culture along with the language also gets used to the youth.

 

SRI EMBERUMAANAR JEEYAR SWAMY –  ALWAR TIRUNAGARI, TAMIL NADU

 

We all should respect and follow our rich culture and traditions.

We should also inform the coming generations about the basic things related to our Sanatana Dharma like Puranas, Mahabharata, Ramayana etc. We should take our culture to every village and train the people there to walk in a good way.

Such conferences are very important for all the living beings of the world to live in a better way and for our Sanatana Dharma to spread globally.

 

SRI KAMALANANDA BHARATI SWAMY, BHUVANESHWARI PEETHAM, GANNAVARAM, VIJAYAWADA

 

TTD is the boon given by that Almighty to the Hindus spread all over the world. Hindu Dharma Prachara Parishad was formed by TTD giving special priority to take up Sanatana Hindu Dharma Prachara in a widespread manner across the country. 

 

Under Sri Bhumana Karunakara Reddy during his first stint as TTD Chairman a revolutionary programme named, “Dalita Govindam” was organized which won huge appreciation. At that time, Dalits also welcomed and participated in the programme with utmost enthusiasm. Similar programmes should be introduced by TTD to enlighten the rural masses about Hindu Sanatana Dharma.

 

SRI SOUNDARAJAN, CHILUKURU BALAJI TEMPLE

 

Priests should be made partners in the protection of Sanatana Dharma in existing temples. A proper explanation on the essence of our Hindu Dharma should be taught to the lower classes. Priority should be given to the lower classes as per the legend of Mala Haridasu Sthala Purana in Vontimitta Sri Kodandarama Temple. TTD run Dasa Sahitya project and Annamayya project programs are successful. Nama 

Sankirtana and Bhajan programs should be expanded.

 

SRI SUBUDENDRA THEERTHA SWAMY, SRI RAGHAVENDRA MUTT –  MANTRALAYAM

 

TTD has been preserving Sanatana Dharma for generations. Everyone should work for the protection of Dharma. Although TTD is doing many religious programs, some people are indulged in criticism which is not a right gesture. TTD is working all over the world for the propagation of Hindu Dharma. Special attention should be given to the propagation of Dharma in the temples in Tirupati. 

 

SRI REVATHI RAMANA DAS, ISKCON, TIRUPATI

 

Due to the special attention of TTD Chairman Sri Karunakara Reddy and EO Sri Dharma Reddy, many religious programme have been introduced by TTD. Glorify Govinda Nama across the world as in Kaliyuga Nama Sankeertanam is the best way for salvation. TTD’s Goshala is one of the country’s best and a role model to other organisations. Liquor shops and mutton stalls in Tirupati should be shifted to the suburbs of the city akin to Dwaraka, Kurukshetra, Ayodhya. 

 

SRI VIDYA PRAKASANANDAGIRI SWAMY, SHUKABRAHMA ASHRAM, SRIKALAHASTI

 

Books on Sri Suktam, Sri Lakshmi Ashtottaram and Dharma should be printed and distributed. TTD should make efforts to promote Sanatana Dharma from school level itself to encourage children of the present generation to follow the ethical values embedded in our Hindu Sanatana Dharma.

 

SADAGOPAN RAMANUJA JEEYAR – SIVILLIPUTTUR, TAMIL NADU

 

The present TTD administration is working on Sri Ramanujacharya’s idea that everyone should attain moksha which is possible only by following the principles of Hinduism. We should all be united and remove the differences among us and strive unitedly to take forward Hindu Sanatana Dharma.

 

SRI VIDYA VIJAYA THEETHA SWAMY, BENGALURU

 

Hindu Sanatana Dharma is being organized in a big way by TTD through 27 projects.  Among various other Charitable activities, TTD is running various hospitals giving affordable qualitative treatment.  Be it literature, art, music or anything TTD is arranging variety of activities. It should continue its propagation and promotion activities forever.

 

SRI NARAYANJEE MAHARAJ, DWARAKA SANKARACHARYA MUTT, GUJARAT

 

It is the need of hour that every Peethadhipati irrespective of the cult they are following, should unite to promote, protect and propagate Hindu Sanatana Dharma in a wide spread manner and TTD being the custodian of Hindu Sanatana Dharma has to lead the Dharma Prachara as a front runner.

 
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు పీఠాధిపతులందరూ ఏకం కావాలి

– ధార్మిక సదస్సులో రెండో రోజు ఉదయం స్వామీజీల అనుగ్రహ భాషణం

ఫిబ్రవరి 04, తిరుమల, 2024: హిందూ సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు దేశంలోని పీఠాధిపతులు, మఠాధిపతులు ఏకం కావాలని, ఇందుకోసం టీటీడీ ముందు వరుసలో ఉంటుందని స్వామీజీలు అనుగ్రహ భాషణం చేశారు. తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న ధార్మిక సదస్సులో రెండో రోజైన ఆదివారం ఉదయం 17 మంది స్వామీజీలు పాల్గొన్నారు.

వెదురుపాక స్వామీజీ, విజయదుర్గ పీఠం

శ్రీ కరుణాకరరెడ్డిగతంలో ఛైర్మన్ గా ఉన్నప్పుడు ధార్మిక సదస్సు నిర్వహించారు. అప్పుడు మేము ఇచ్చిన సలహాలు, సూచనలు అమలు చేశారు. శ్రీవారి ఆలయ అభివృద్ధికి ఈవో శ్రీ ధర్మారెడ్డి ఎనలేని కృషి చేశారు. ఐదు సంవత్సరాలలో తిరుమలలో సామాన్య భక్తులుకు ఎన్నో సౌకర్యాలను కల్పించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా ఈవో దృష్టి సారించడం మంచి పరిణామం. భవిష్యత్తులో కూడా ఇదే తరహలో టీటీడీ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

శ్రీ సుజయనిధి తీర్థ స్వామి, శ్రీపాదరాజ మఠం, ముళ్ భాగల్.

ఈ కార్యక్రమాన్ని చేస్తున్న టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్, ఈవో ఇతర అధికారులకు అభినందనలు. తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో ప్రత్యేకమైన స్థానంలో ఉంది. సనాతన ధర్మంలో ప్రతి ఒక్క పీఠాధిపతిని భాగస్వామిని చేయాలి. దేశంలోని ప్రతి ఇంటికీ సనాతన హిందూ ధర్మం, ఆచారాలు, సాంప్రదాయాల గురించి తెలియపరచడానికి కృషి చేయాలి.

శ్రీ ముకుందానంద మహరాజ్ – జ్యోతిర్ మఠం, ఉత్తరాఖండ్

సనాతన ధర్మం అంటే కేవలం మనుషులు మాత్రమే కాక పశుపక్షాదులు, వృక్షాలు, జంతువులు సమస్తం సుభిక్షంగా ఉండడం. ఆధునిక విద్యలో మన సనాతన హిందూ ధర్మం, సంస్కృతి సంప్రదాయాల గురించి అందరికీ తెలియపరచాలి. గోమాతను విశ్వమాతగా ప్రకటించాలి.

శ్రీ మన్నార్ గుడి శాంతాలంకార షెన్ భాగమన్నార్ జీయర్ స్వామి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న మత మార్పిడులను నివారించడానికి టీటీడీ కృషి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం, గోసంరక్షణ కోసం టీటీడీ పని చేయాలి. వైద్య, విద్యా సంస్థల్ని మరింత విస్తృతం చేయాలి.

శ్రీ అనుపమానంద మహరాజ్, రామకృష్ణ సేవా సమితి, కడప.

ధార్మిక సదస్సులో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను, సూచనలు, సలహాలను ఆమోదించి, అమలుపరుస్తామని శ్రీ భూమన కరుణాకరరెడ్డి ప్రకటించడం సంతోషకరం. భవిష్యత్ తరాలకు ధర్మాన్ని అందిచడానికి మరిన్ని మెరుగైన ప్రయత్నాలు చేపట్టాలి. ధర్మాచరణ పట్ల యువతకు ఆసక్తిని పెంపొదించాలి. సంస్కృత భాషను ప్రోత్సహించాలి. దీనివల్ల భాషతో పాటు సంస్కారం కూడా యువతకు అలవడుతుంది.

శ్రీ కమలానంద భారతీ స్వామి, భువనేశ్వరి పీఠం, గన్నవరం, విజయవాడ.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం టీటీడీ. హిందూ ధర్మ ప్రచారానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ హిందూ ధర్మప్రచార పరిషత్ ను ఏర్పాటు చేసింది. ధర్మ ప్రచార పరిషత్ ఇంటింటికీ కరపత్రాన్ని పట్టుకుని వెళ్లి ప్రచారం నిర్వహిస్తోంది‌. అప్పట్లో శ్రీ భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత గోవిందం గొప్ప కార్యక్రమం. అప్పట్లో ఉమ్మడి కడప జిల్లాలో కూడా దళితులు చక్కగా కార్యక్రమాన్ని స్వాగతించి నిర్వహించుకున్నారు.

శ్రీ సౌందరరాజన్ రంగరాజన్, చిలుకూరు బాలాజీ ఆలయం, హైదరాబాద్.

ధర్మాన్ని రక్షించి భావితరాలకు అందించటానికి సదస్సు ఏర్పాటు చేశారు. ఉన్న ఆలయాల్లో ధర్మరక్షణ కోసం అర్చకుల్ని భాగస్వాములను చేయాలి. అట్టడుగు వర్గాల వారికి సరైన వివరణ ఇవ్వాల్సి ఉంది. ఒంటిమిట్ట రామాలయంలో మాల హరిదాసు స్థల పురాణం ఉంది. అక్కడ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అట్టడుగువర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. దాస సాహిత్య ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్టుల ద్వారా నామసంకీర్తన, భజన కార్యక్రమాలు విస్తృతం చేయాలి. పాఠశాల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. బుర్రకథలు, ఒగ్గు కథలను ప్రోత్సహించాలి. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఉత్తాల పండుగలో టీటీడీ చొరవ తీసుకుని భాగస్వామ్యం కావాలి.

శ్రీ విద్యావల్లభతీర్థ స్వామి, కన్నూర్ మఠం, ఉడుపి.

భారతదేశంలో ఉన్న సాధు సంతులను టీటీడీ ఒక చోట చేర్చి ఇలాంటి మహత్ కార్యాన్ని చేపట్టింది. మన సనాతన సంప్రదాయాన్ని నిలిపేందుకు మరిన్ని కార్యక్రమాలు చేయాలి. పిల్లల్లో నైతికత పెంచే కార్యక్రమాలు సంతోషకరం. గుడికో గోమాత కార్యక్రమం విజయవంతం కావడం ఆనందం. దాస సాహిత్యం ఉన్నత స్థాయిలో ప్రచారం కావడానికి టీటీడీ కృషి విశేషం. వేద అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు మరింతగా ఆర్థిక సహాయం చేయాలి. టీటీడీ ఛైర్మన్, కార్యనిర్వహణాధికారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

శ్రీ రేవతి రమణదాస్, అంతర్జాతీయ ఉపాధ్యక్షులు, ఇస్కాన్.

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) కార్యక్రమాలు చాలా బాగున్నాయి. టీటీడీ ఈవో శ్రీ ధర్మా రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వల్ల శ్రీ రామాయణ, భాగవతం సహా పలు కార్యక్రమాలు ఎస్వీబీసీలో ప్రసారం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా గోశాలలు ఏర్పాటు చేయాలి. టీటీడీ ఛైర్మన్, ఈవో మంచి ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. తిరుమల తరహాలో తిరుపతి ఇతర ప్రాంతాల్లో గోవింద నామస్మరణ జరగాలి.

శ్రీ విద్యా విజయతీర్థ స్వామి, బెంగళూరు.

దాస సాహిత్యం ప్రచారం బాగా జరుగుతోంది. టీటీడీ 27 ప్రాజెక్టుల ద్వారా అనేక హిందూ ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ధార్మిక, సాంస్కృతిక, విద్య, వైద్య సేవాకార్యక్రమాలు నిర్వహించడం సంతోషం. ఇప్పటి పరిస్థితుల్లో లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేసుకోలేని స్థితిలో ఉన్న వారికి వైద్యం అందిస్తున్న టీటీడీకి ప్రత్యేక కృతజ్ఞతలు. సాహిత్యం, శిల్పకళా శాస్త్రం, సంగీత శాస్త్రం అన్నింటిలో ప్రత్యేక కృషి చేస్తోంది. టీటీడీ ఛైర్మన్, కార్యనిర్వహణాధికారి రూపంలో ఆ భగవంతుడు ఈ కార్యక్రమాలు చేయిస్తున్నారు. టీటీడీ వేదపరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
సప్తగిరి మాసపత్రికను పలు భాషల్లో ప్రచురిస్తున్నారు. ఇలాంటి పలు కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుతున్నాం.

శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ, పెద్ద పులిపాక ఆశ్రమం, కృష్ణా జిల్లా.

గోసంరక్షణ కోసం టీటీడీ చర్యలు తీసుకోవాలి. మాతృమూర్తులు, స్త్రీలను గౌరవించడం ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేయాలి. టీటీడీ పాలక మండలిలో ధర్మాచార్యులకు కూడా అవకాశం ఇస్తే సలహాలు, సూచనలకు అవకాశం ఉంటుంది.

శ్రీ నారాయణజీ మహారాజ్, ద్వారక, శంకరాచార్య మఠం, గుజరాత్.

హిందూ సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి, రక్షించడానికి పలు పీఠాలకు చెందిన పీఠాధిపతులు, మఠాధిపతులందరూ ఏకం కావాలి. ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంలో టీటీడీ ముందు వరుసలో ఉంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.