“LET US LEARN SANSKRIT” CLASSES WON ACCOLADES OF DEVOTEES_ శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ప్రసారం చేస్తున్న ”సంస్కృతం నేర్చుకుందాం” కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది

Tirumala, 4 May 2018: Describing “Sanskritam Nerchukundam” as one of the best programmes which has garnered immense popularity among the public, the TTD EO Sri Anil Kumar Singhal said, more classes will be recorded and telecasted on SVBC.

After Dial your Programme, addressing media persons, the EO said, SVBC has so far recorded 35 Sanskrit Learning Classes. Based on the feedback we receive from the public we want to improvise the programme to further extent”, he added.

He said, TTD has commenced the selection of choice of area in Srivari Seva online service from April 25. “This is introduced with a motto to encourage professionalism in Srivari Seva so that those who have versatility in their respective fields can opt while booking in online for Srivari Seva voluntary service and render qualitative services to pilgrims. Those who have already registered will report for seva of their choice from May 4 onwards”, he observed.

The EO also said, We have collected feedback on the quality, sort of programmes that are being telecasted on SVBC in VQC compartments and also on the devotional songs and announcements played in both footpath routes. We received a very good feedback from pilgrims and based on this we are going to make changes as per the wish of the pilgrims”, he said.

Later the EO said, the annual brahmotsavams in Sri Govinda Raja Swamy temple are scheduled from May 21 to 29 in Tirupati.

JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar, SO Sri N Muktheswara Rao, CE Sri Chandrasekhar Reddy were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్‌విబిసి :

మే 04, తిరుమల, 2018: శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ప్రసారం చేస్తున్న ”సంస్కృతం నేర్చుకుందాం” కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

శ్రీవారి సేవ :

ఆసక్తి గల విభాగాల్లో సేవలందించేందుకు వీలుగా శ్రీవారి సేవకులు నమోదు చేసుకునేందుకు ఏప్రిల్‌ 25న ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను ప్రారంభించాం. ఈ విధానం ద్వారా మే 4వ తేదీ నుండి శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారు.

భక్తుల అభిప్రాయ సేకరణ :

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో ప్రదర్శితమవుతున్న ఎస్‌విబిసి కార్యక్రమాలపై భక్తుల అభిప్రాయాలు సేకరిస్తున్నాం. భక్తుల అభిరుచికి అనుగుణంగా మెరుగైన కార్యక్రమాలు రూపొందిస్తాం.

నడకమార్గాల్లో భక్తులు కోరిన విధంగా భక్తిగీతాలు, సంకీర్తనలను రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా వినిపిస్తాం.

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మూెత్సవాలు :

మే 21 నుండి 29వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మూెత్సవాలను వైభవంగా నిర్వహిస్తాం.

డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ టిటిడి నూతనంగా ప్రవేశ పెట్టిశ సమయ నిర్దేశిత సర్వదర్శనంపై విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఎస్‌డి కౌంటర్ల వద్ద భక్తులకు 15 సెకన్లలోనే టోకెన్లు కేటాయిస్తున్నామన్నారు. భక్తులు గ్రూపుగా వచ్చి అందులో ఒకరు, ఇద్దరికి ఆధార్‌ లేకపోయిన, ఆధార్‌ కార్డు వాట్సాప్‌లో చూపించిన టోకెన్లు ంజురు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి రోజు వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లి దండ్రులకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలు యధావిదిగా వుంటాయన్నారు. వేసవి రద్దీ నేపధ్యంలో ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించాలనే ఉద్ధేశంతో వృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు పిల్లలు, వారి తల్లిదండ్రులకు ప్రతి నెల ఇచ్చే రెండు రోజుల ప్రత్యేక దర్శనాలను మే, జూన్‌ నెలలో రద్దు చేసినట్లు వివరించారు.

తిరుమలలో పారిశుద్ధ్యం, మరుగుదొడ్లను పెంచడంపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మే 20వ తేదీ లోపు తిరుమల మాడవీధులలో సిసి కెేమరాలు, వీడియోవాల్‌ ఏర్పాటును పూర్తి చేస్తామన్నారు. ఎయిర్‌పోర్టు తరహాలో తనిఖీలు నిర్వహించేందుకు విక్యూసిలో అత్యాధునిక స్కానర్లు త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా టిటిడి విద్యాసంస్థలలో హాస్టల్‌ సౌకర్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.