అక్టోబరు 10 నుండి 19వ తేదీ వరకు శ్రీ శేషాచ‌ల లింగేశ్వ‌ర స్వామివారి ఆల‌యంలో నవరాత్రి ఉత్సవాలు

అక్టోబరు 10 నుండి 19వ తేదీ వరకు శ్రీ శేషాచ‌ల లింగేశ్వ‌ర స్వామివారి ఆల‌యంలో నవరాత్రి ఉత్సవాలు

తిరుపతి, 2018 అక్టోబ‌రు 10: టిటిడికి అనుబంధంగా ఉన్న చంద్ర‌గిరి మండ‌లం శేషాపురం గ్రామంలోని శ్రీ శేషాచ‌ల లింగేశ్వ‌రస్వామివారి ఆల‌యంలో అక్టోబరు 10 నుండి 19వ తేదీ వరకు శ్రీ ఉమామ‌హేశ్వ‌రి అమ్మ‌వారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇందుకోసం ఆలయంలో ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అక్టోబ‌రు 10న శ్రీ ఉమామ‌హేశ్వ‌రి దేవి, అక్టోబరు 11న శ్రీ బాలాత్రిపుర సుంద‌రి దేవి, అక్టోబరు 12న శ్రీ గాయ‌త్రిదేవి, అక్టోబరు 13న శ్రీ అన్నపూర్ణాదేవి, అక్టోబరు 14న శ్రీ ల‌లితాదేవి, అక్టోబరు 15న శ్రీ సరస్వతి దేవి, అక్టోబరు 16న శ్రీ మ‌హాలక్ష్మీదేవి, అక్టోబరు 17న శ్రీ దుర్గాదేవి, అక్టోబరు 18న మహిషాసురమర్థిని, అక్టోబరు 19న శ్రీ రాజ‌రాజేశ్వ‌రి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. చివరిరోజు దుర్గా హోమం నిర్వ‌హిస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలితసహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.