LIST OF FESTIVALS IN SRI GT IN THE MONTH OF NOVEMBER _ నవంబరులో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 30 October 2017: Many festivals are being observed in the famous ancient shrine of Lord Sri Govindaraja Swamy in Tirupati, all through the year. Some important religious events to be observed in the month of November as follows:

November 1: Kaisika Dwadasi Asthanam

November 3, 10, 17, 24 : Procession of Sri Andal in four mada streets.

November 4: Pournami Garuda Vahana Seva

November 6: Procession of Sri Parthasaradhi Swamy with Rukmini and Satyabhama on the advent of Rohini Nakshatram.

November 14: Procession of Sri Govinda Raja Swamy along with his consorts on the advent of Uttara Nakshatram.

November 23 to December 2: Tirumangai Alwar Festival

November 25: Procession of Sri Kalyana Venkateswara Swamy with Ubhaya Nancharulu on Shravanam star.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

నవంబరులో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2017 అక్టోబరు 29: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నవంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.

వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– నవంబరు 1న కైశికద్వాదశి ఆస్థానం.

– నవంబరు 3, 10, 17, 24వ తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు.

– నవంబరు 4న పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారి గరుడసేవ వైభవంగా నిర్వహించనున్నారు.

– నవంబరు 6న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు శ్రీరుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారథిస్వామివారు ఆలయ నాలుగు మాడ

వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

– నవంబరు 14న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి వారికి సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

– నవంబరు 23 నుండి డిసెంబరు 2వ తేదీ వరకు శ్రీ తిరుమంగై ఆళ్వార్‌ సాత్తుమొర

– నవంబరు 25న శ్రవణ నక్షత్రన్ని పురస్కరించుకుని శ్రీ భూ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.