LIST OF PROHIBITED GOODS FLEX DISPLAYED AT ALIPIRI_ అలిపిరి వద్ద నిషేధిత పదార్థాల సూచిక బోర్డుల ఏర్పాటు

Tirupati, 14 September 2017; To bring awareness and to for better information of the pilgrims to avoid carriage of prohibited items like cigarettes, liquor, gutka etc. to Tirumala, the Vigilance department under the instructions of Chief Vigilance and Security Officer Sri A Ravikrishna set up a flex board at Alipiri toll gate on Thursday.

Some of the pilgrims especially from North India, other countries, without knowledge, bringing the banned items to Tirumala like Gutka, Cigarettes etc. and were being caught by the security and vigilance sleuths at Alipiri.

To avoid such repeated incidents, the CVSO has come up with the idea of informing pilgrims to avoid carrying prohibited items to Tirumala.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

అలిపిరి వద్ద నిషేధిత పదార్థాల సూచిక బోర్డుల ఏర్పాటు

తిరుపతి, 2017 సెప్టెంబరు 14: తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులలో చైతన్యం నింపేందుకు నిషేధిత పదార్థాలతో కూడిన సూచిక బోర్డులను గురువారం టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం అలిపిరి టోల్‌గేట్‌, నడకదారి మార్గంలో ఏర్పాటు చేసింది.

దేశవిదేశాల నుండి విచ్చేసే శ్రీవారి భక్తులు తిరుమలలో వివిధ రకాల నిషేధిత పదార్థాలైన మద్యం, మాంసం, గుట్కాలు వంటి వాటిని
తీసుకువెళ్లడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భక్తులను చైతన్యం చేసేందుకు తిరుపతి, తిరుమలలోని రద్దీ ప్రాంతాలలో ప్రధాన కూడళ్లలో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ ఆకే రవికృష్ణ, ఎస్పీఎఫ్‌ డిఎస్పీ శ్రీశంకర్‌రావు, ఎవిఎస్వో శ్రీ గంగరాజు ఎక్సైజ్‌ సిఐ శ్రీ మురళి మోహన్‌, ఇరత అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.