JEO RELEASES SRI KT POSTERS_ శ్రీకపిలేశ్వరాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల గోడపత్రికల ఆవిష్కరించిన టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 14 September 2017: In view of Navarathri festival, Goddess Sri Kamakshi Devi in Kapileswara Swamy temple at Tirupati will bless the devotees in different Alankaras from September 22 to 30, said JEO Sri P Bhaskar.

The Tirupati JEO released the posters of Sri K T Navarathri Utsavams in his chambers in TTD administrative building on Thursday evening. Speaking on this occasion, the JEO said, the Goddess will bless devotees as Kamakshi Devi on September 22, Durga on 23, Annapurneshwari on 24, Sri Mavadi on 25, Adiparashakthi on 26, Mahalakshmi on 27, Saraswathi on 28, Mahisasura Mardani on 29 and concludes with Paruveta Utsavam on September 30.

Spl Officer Sri Mukteswara Rao, DyEO Sri Subramanyam were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీకపిలేశ్వరాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల గోడపత్రికల ఆవిష్కరించిన టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2017 సెప్టెంబరు 14: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలోసెప్టెంబరు 23 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్న దేవీ నవరాత్రి ఉత్సవాల గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీకామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 22న శ్రీకామాక్షి దేవి, సెప్టెంబరు 23న శ్రీ దుర్గాదేవి, సెప్టెంబరు 24న శ్రీ అన్నపూర్ణాదేవి, సెప్టెంబరు 25న శ్రీమావడి సేవ, సెప్టెంబరు 26న శ్రీ ఆదిపరాశక్తి, సెప్టెంబరు 27న శ్రీ లక్ష్మిదేవి, సెప్టెంబరు 28న శ్రీ సరస్వతి దేవి, సెప్టెంబరు 29న మహిషాసుర మర్థిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 30న చివరిరోజు విజయదశమి పర్వదినం, పార్వేట ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిమజేశారు.

దేవీ నవరాత్రి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని జెఈవో కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ శంకర్‌రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.