LNG TO REPLACE LPG SOON IN TIRUMALA-TTD EO_ – తిరుమలలోని అన్ని వంటశాలలకు ఎల్.జి పైపులైన్ ద్వారా గ్యాస్ – డయల్ యువర్ ఈవోలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
DEVOTEES LAUDS TTD ACTIVITIES
TIRUMALA, 02 FEBRUARY 2024: Plans are anvil to replace the Liquid Petroleum Gas (LPG) with the Liquid Natural Gas (LNG) in Tirumala which is relatively safety and cheaper, said TTD EO Sri AV Dharma Reddy.
Answering a query by a pilgrim caller Sri Appanna from Visakhapatnam who brought to the notice of EO about the safety issues involved due to the using of LPG gas by a few hoteliers in Tirumala. Responding to the caller, the EO said soon TTD is contemplating to replace LPG with LNG in all its kitchens at the main Annaprasadam complex, VQC Canteen, Employees Canteen as the Government of India is mulling for environmentally cleaner, cost-efficient and technologically adaptable fuel. It has also appointed an Agency in each district and we are also planning to go for LNG by laying a pipeline with the connectivity of all our Annaprasadam units besides the private eateries in Tirumala.
While callers Sri Shankar from Vijayawada, Sri Subhash from Hindupur, Sri Appa Rao sought to resume offline for Senior citizens, Angapradakshina and Srivari Seva respectively to which EO replied that TTD has introduced an online mechanism keeping in view the benefit of devotees to avoid unnecessary waiting and to enhance transparency in Srivari Seva voluntary service.
Sri Himakar from Vijayawada, Sri Basavaraju from Hindupur complimented EO for reviving Sri Venkateswara Bhakti Channel and also for developing a devotee-friendly mechanism in the administration and suggested him to display programmes of SVBC on the previous day for the information of the public. Welcoming the suggestion the EO thanked the devotees for watching the SVBC for over 10 hours every day and identifying the pilgrim-friendly efforts of TTD. “Your words of appreciation are like an oasis in the desert for us and boost up our energies to render more efficient services to the visiting pilgrims”, EO asserted.
When Sri Hussain Bhasha from Naidu Peta sought EO to provide the Muslim devotees of Sri Venkateswara Swamy to permit to render Srivari Seva, reacting to the caller, the EO said, he is indeed happy to note their dedication despite of other religious faith. Many devotees belonging to different faiths have made and been making donations to Sri Venkateswara. He said he will verify the possibility on his request.
A septuagenarian devotee Sri Durga Rao from Vijayawada brought to the notice of EO that how he could not had darshan of Srivaru during December last as he fell unconscious after reaching the Vaikuntham Queue Complex and how the medical team assisted him, the EO apologized the pilgrim for the inconvenience caused to the devotee and said he will be arranged darshan by temple officials soon and also expressed his pleasure for the timely involvement of the Medical team in assisting the pilgrim to regain his consciousness.
Sri Srinivasa Rao from Vijayawada brought to the notice of TTD EO about the speeding private taxis in Tirumala and suggested to provide them a speed limit to which the EO replied that TTD Vigilance and Police often conducts awareness classes to the private drivers and even takes sever measures if they violate the norms. However, we will again conduct a training and awareness class to them soon, he maintained.
While one Sri Anand has suggested for Vaikuntham Queue Complex 3 for the waiting of pilgrims, the EO said, in a decade’s time the entire Darshan system will be operated with Time Slot avoiding serpentine queue lines and long waiting hours for pilgrims.
Smt Mahalakshmi from Visakhapatnam suggested EO to perform Rudrabhishekam every month besides Karthika Masam to which EO replied the suggestion is well taken and discuss with the religious persons on implementation.
తిరుమలలో భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు
– తిరుమలలోని అన్ని వంటశాలలకు ఎల్.జి పైపులైన్ ద్వారా గ్యాస్
– డయల్ యువర్ ఈవోలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2024 ఫిబ్రవరి 02: తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు టెండర్ల ప్రక్రియను నిలిపివేసి, మిల్లర్ల ద్వారా నాణ్యమైన బియ్యం సేకరించి అన్నప్రసాదాలు అందిస్తున్నామని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు టీటీడీ వంటశాలలు, హోటళ్లు, స్థానికులకు ఎల్.జి పైపులైన్ ద్వారా గ్యాస్ అందించేందుకు బోర్డు సమావేశంలో చర్చించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
1. సాయి చరణ్ – నల్గొండ
ప్రశ్న : దర్శన టికెట్ బుక్ చేసుకున్నాము గదులు ఆన్లైన్లో దొరకడం లేదు.
ఈవో : తిరుమలలో 7500 గదులు మాత్రమే ఉన్నాయి. ఇందులో 50 శాతం గదులు ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ లో కేటాయిస్తున్నాం. ఆన్లైన్లో గదులు దొరకని భక్తులు తిరుమలలో సిఆర్వోలో నమోదు చేసుకుని గదులు పొందవచ్చు. తిరుపతిలో కూడా గదులు పొందే అవకాశం ఉంది.
2. అప్పారావు, మనోహర్ – క్రిష్ణగిరి
ప్రశ్న : శ్రీవారి సేవ ఆన్లైన్లో దొరకడం లేదు. ఆఫ్ లైన్లో ఇవ్వండి.
ఈవో : ఆఫ్ లైన్లో శ్రీవారి సేవ ఇస్తుండడం వల్ల దళారుల బెడద ఎక్కువగా ఉంది. ఈ కారణంగా ఆన్లైన్ లో పూర్తి కోటా కేటాయిస్తున్నాం.
3. సునీల్ – సూర్యాపేట
ప్రశ్న : శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులు టోకెన్లు తీసుకుని తిరిగి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్తున్నారు.
ఈవో : చాలామంది భక్తులు టోకెన్ల కోసమే నడక మార్గాల్లో తిరుమలకు వస్తున్నారు. ఇటీవల చిరుత దాడి జరిగిన సంఘటనలు మీకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతిలోనే టోకెన్లు జారీ చేస్తున్నాం. వీటిని పొందిన భక్తులు మొక్కులున్నవారు నడిచి రావచ్చు. మొక్కులు లేనివారు రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకోవచ్చు.
4. జనార్ధన్ – బెంగళూరు
ప్రశ్న : పంచగవ్య ఉత్పత్తులను ఆన్లైన్లో అందుబాటులో ఉంచండి.
ఈవో : ఇదివరకే ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం జరిగింది. మీకు ఫోన్ చేసి మరింత సమాచారం తెలియజేస్తాం.
5. మహాలక్ష్మి – వైజాగ్
ప్రశ్న : కార్తీక మాసంలో రుద్రాభిషేకం చాలా బాగా చేశారు. ప్రతినెలా ఈ కార్యక్రమం నిర్వహించండి.
ఈవో : పండిత మండలి సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రతినెలా రుద్రాభిషేకం నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం.
6. అమరశంకర్ – విజయవాడ
ప్రశ్న : ఆంగప్రదక్షిణ టికెట్లు మూడు నెలల ముందు ఆన్లైన్లో ఇస్తున్నారు. చాలామందికి దొరకడం లేదు. ఆఫ్ లైన్లో కొన్ని టికెట్లు ఇవ్వండి.
ఈవో : ఆఫ్ లైన్లో ఇవ్వడం ద్వారా భక్తులు క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ మంది భక్తుల కోరిక మేరకే ఆన్లైన్లో ఈ టికెట్లు కేటాయిస్తున్నాం ఈ విధానం చక్కగా ఉంది.
7. అప్పన్న – వైజాగ్
ప్రశ్న : టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తుంటే చాలా సమస్యలు పరిష్కారం కావడం లేదు. మెయిల్ పెట్టే అవకాశం ఉందా. తిరుమలలో ప్రైవేట్ హోటళ్ల నిర్వాహకులు బయటే స్టౌ పెట్టి వంట చేస్తున్నారు, ఇది ప్రమాదకరం.
ఈవో : టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా చాలామంది భక్తులకు సమాచారం తెలియజేస్తున్నాం. ఈ-మెయిల్ ద్వారా కూడా భక్తులు సమాచారం తెలుసుకోవచ్చు. తిరుమలలోని టీటీడీ ఆధ్వర్యంలో గల అన్ని వంటశాలలు, మఠాలు, ప్రైవేట్ హోటళ్లకు ఎల్.జి విధానం ద్వారా పైపులైన్ ద్వారా గ్యాస్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ విషయాన్ని వచ్చే బోర్డు సమావేశంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం.
8. శ్రీకాంత్ – తెలంగాణ
ప్రశ్న : సీనియర్ సిటిజన్ దర్శన టికెట్ బుకింగ్ లో సాంకేతిక సమస్య తలెత్తింది.
ఈవో : మీకు ఫోన్ చేసి తిరిగి దర్శనం కల్పించే ప్రయత్నం చేస్తాం.
9. శ్రీనివాసరావు – విజయవాడ
ప్రశ్న : తిరుమలలో ప్రైవేట్ వాహనాలు అతివేగంగా వెళుతున్నాయి. స్పీడ్ లిమిట్ పెట్టండి.
ఈవో : ఈ విషయాన్ని విజిలెన్స్, పోలీసు అధికారులు దృష్టికి తీసుకెళ్లి ప్రైవేటు వాహనాల డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇప్పిస్తాం.
10. హుస్సేన్ బాషా – నాయుడుపేట
ప్రశ్న : ముస్లిం భక్తులు శ్రీవారి సేవకు రావాలనుకుంటున్నారు. అవకాశం ఇప్పించండి.
ఈవో : ముస్లిం భక్తులు శ్రీవారి సేవకు రావాలని కోరడం చాలా సంతోషకరం. ముస్లిం భక్తులు చాలామంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు. పలువురు ముస్లిం భక్తులు స్వామివారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలతో అనేక విరాళాలు కూడా సమర్పించారు. వీటిలో స్వామివారికి స్వర్ణ పుష్పాలు, కాసులమాల వంటివి ఉన్నవి. మీ విజ్ఞప్తిపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం.
11. ఆనంద్ – కర్ణాటక
ప్రశ్న : శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు క్యూలైన్లలో ఎండకు, వానకు, చలికి ఇబ్బందులు పడుతున్నారు. మరో కాంప్లెక్స్ నిర్మించండి.
ఈవో : భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్లలో వేచి ఉండకుండా చేసేందుకుగాను టైం స్లాట్ విధానాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ప్రస్తుతం తిరుపతిలో రోజుకు 25 వేల టైం స్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నాం. భక్తులు వేచి ఉండేందుకు శిలాతోరణం వరకు గల క్యూ లైన్లో ఫ్యాన్లు, మరుగుదొడ్లు, తాగునీరు తదితర వసతులు కల్పించి రూ.15 కోట్లతో ఆధునీకరిస్తున్నాం.
12. శ్రీకాంత్ – మంచిర్యాల
ప్రశ్న : మేల్ చాట్ వస్త్రం పొందే అవకాశం ఉందా. పారిశుధ్యం అక్కడక్కడా లోపించింది.
ఈవో : శుక్రవారం అభిషేకం నాడు మేల్ చాట్ వస్త్రం సేవ ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ పోను విచక్షణ కోటాలో ఐదు టికెట్లు మాత్రమే ఉంటాయి. వీటిని ప్రాధాన్యత ప్రకారం కేటాయించడం జరుగుతుంది. తిరుమలలో ఎలక్ట్రానిక్ డిప్ లో కూడా అభిషేకం టికెట్లు పొందే అవకాశం ఉంది. తిరుమలలో పరిశుభ్రత లోపించకుండా ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు చేపడుతున్నాం.
13. శర్మ – విశాఖపట్నం
ప్రశ్న : టీటీడీ సాహిత్యం, పురాణాల పుస్తకాలు లభించడం లేదు.
ఈవో : టీటీడీ పుస్తక ప్రచురణ అఖండంగా సాగుతోంది. సమాజానికి ఉపయోగపడే పుస్తకాల ప్రచురణకు టీటీడీ సహకరిస్తుంది.
14. వెంకటరమణ – నెల్లూరు
ప్రశ్న : తిరుమల శ్రీవారి దర్శనం త్వరగా జరిగింది. లడ్డు కౌంటర్ వద్ద చాలా ఆలస్యం అవుతుంది. కౌంటర్లు మూసివేస్తున్నారు.
ఈవో : భక్తులకు త్వరగా లడ్డూ ప్రసాదం ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.
15. హిమకర్ – విజయవాడ
ప్రశ్న : ఎస్వీబిసిలో కార్యక్రమాలు చాలా బాగున్నాయి. శ్రీవారి సేవలు, ఉత్సవాల సమయంలో కార్యక్రమాల మార్పు సమయాన్ని ముందుగా తెలియజేయండి. అదేవిధంగా ధర్మసందేహాలు స్లాట్ ఏర్పాటు చేయండి.
ఈవో : టీటీడీ ఉత్సవాలు ఉన్న సమయంలో 24 గంటల ముందుగా సమయం మార్పును తెలియజేస్తాం. టీటీడీలోని ప్రముఖ పండితులతో ధర్మసందేహాలపై ఎస్వీబిసిలో స్లాట్ ఏర్పాటు చేస్తాం.
16. లక్ష్మి – హైదరాబాద్
ప్రశ్న : వయో వృద్ధులకు పర్వదినాల్లో దర్శనం కల్పించండి.
ఈవో : బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కావున ఆ సమయంలో వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా పరిశీలిస్తాం
17. సుభాష్ – హిందూపురం
ప్రశ్న : మూడు నెలల ముందుగా అడ్వాన్స్ బుకింగ్‌లో రూ. 300- టికెట్లు విడుదల చేస్తున్నారు. ఒక నెల ముందుగా విడుదల చేస్తే బాగుంటుంది.
ఈవో : భక్తుల కోరిక మేరకు మూడు నెలలు ముందుగా దర్శనం, ఆర్ధిత సేవలు, వసతి విడుదల చేస్తున్నాం. తద్వారా భక్తులు రవాణా, శెలవులు ముందస్తుగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
18. బసవరాజు – హిందూపురం
ప్రశ్న : స్వామివారిని దగ్గరగా దర్శించుకోవాలని ఉంది. లడ్డు, వడ కౌంటర్ల వద్ద టీటీడీ ఉద్యోగులు భక్తుల లైన్లో వచ్చి ఉద్యోగస్తులమని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు.
ఈవో : లక్కీ డిప్ ద్వారా శ్రీవారి సేవలు ముందస్తుగా పొందవచ్చు. విఐపిల సిఫారస్తు లేఖల ద్వారా పొందవచ్చు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లోను బ్రేక్ దర్శనం పొందవచ్చు. రూ.10 లక్షల కంటే ఎక్కువ విరాళం ఇచ్చిన వారికి సంవత్సరంలో మూడు సార్లు కుటుంబంతో సహా బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం టీటీడీ కల్పిస్తోంది.
19. దుర్గారావు విజయవాడ
ప్రశ్న : ఎస్ఎస్‌డి టోకెన్లతో స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాను. అక్కడ ఉన్న ప్రథమ చికిత్స కేంద్రంలో చికిత్స అందించారు. స్వామివారి దర్శనం చేసుకోలేదు, కానీ లడ్డూలు అడిగితే ఇవ్వలేదు.
ఈవో : టైమ్స్ స్లాట్ ద్వారా రెండు గంటల్లో దర్శనం అయిపోతుంది. టీటీడీ ప్రథమ చికిత్స కేంద్రంలో మీకు మంచి సేవలందించారని మీరు తెలుపుతున్నారు. కావున మా వైద్య విభాగం బాగుంది. మా అధికారులు మీతో మాట్లాడి దర్శనం కల్పిస్తారు.
20. రంగనాథన్ – పాండిచ్చేరి
ప్రశ్న : నేను వయోవృద్ధుడిని, ఎన్ని సార్లు ప్రయత్నించిన శ్రీవారి కల్యాణం టికెట్లు ఆన్‌లైన్ లో దొరకడం లేదు.
ఈవో : శ్రీవారి కల్యాణం టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఒక రోజు ముందు తిరుమలలో లక్కీ డిప్ ద్వారా పొందవచ్చు. మా అధికారులు మీతో మాట్లాడి దర్శనం కల్పిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.