GEAR UP FOR RATHA SAPTHAMI- EO _ అన్ని విభాగాల సమన్వయంతో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు- ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala,02 February 2024: TTD EO Sri AV Dharma Reddy directed officials of all departments to coordinate efforts and organise all-round arrangements for the convenience of devotees coming for Surya Jayanti also known as Ratha Sapthami at Tirumala on February 16.

 

Addressing a review meeting of officials and district police at Annamaiah Bhavan on Friday evening, the EO reviewed in detail on Anna Prasadam, Health, Engineering, Srivari temple, Garden, Srivari Seva, security, SVBC and HDPP. 

 

He said there would be a procession of seven vahanams along Mada streets from dawn to dusk and asked officials to ensure against any inconvenience to devotees in galleries.

 

Among others, he directed officials to install temporary sheds along Mada streets for the sake of devotees and instructed to keep a buffer stock of four lakh laddus. 

 

He directed Anna Prasadam officials to supply buttermilk, sambar rice, curd rice Pulihora, Pongal etc from all through the processions at regular intervals and the health department to supply water along the Mada streets utilizing the services of Srivari Sevaks.

 

He urged senior officials to supervise arrangements of the supply of medicines by medical staff, stationing of ambulances, frequent cleaning by sanitation staff etc.

 

He also said in view of the festival, TTD has cancelled all Arjita sevas, VIP Break, Senior citizen, physically Handicapped, parents with infants darshans for the day.

 

TTD has also stalled the issuance of SSD tokens in Tirupati from February 15-17.  MBC-34 and TB counters will remain closed from midnight of February 13 till midnight of February 16 and only CRO and Sri Padmavati Rest Houses allotments operate.

 

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam CVSO Sri Narasimha Kishore, CEO Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, Srivari temple one of chief Archakas Sri Venugopala Deekshitulu, SE2 Sri Jagadeeshwar Reddy, CPRO Dr T Ravi and other police officials were also present.

 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

అన్ని విభాగాల సమన్వయంతో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు

– ఫిబ్ర‌వ‌రి 15, 16, 17వ తేదీల్లో ఎస్ఎస్‌డి టోకెన్లు ర‌ద్దు

– ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2024 ఫిబ్ర‌వరి 02: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీ రథసప్తమి పర్వదినానికి విచ్చేసే వేలది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులు, పోలీస్ అధికారుల‌తో శుక్ర‌వారం ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, రథసప్తమికి సంబంధించిన ఏర్పాట్లపై అన్నప్రసాదం, ఆరోగ్యశాఖ, ఇంజనీరింగ్‌ విభాగం, ఆలయం, ఉద్యానవనశాఖ, శ్రీవారి సేవ, భద్రతా విభాగం, ఎస్వీబీసి, ధర్మప్రచారపరిషత్‌ తదితర విభాగాధిపతులకు పలు సూచనలు చేశారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు తిరుమలలో ఏడు వాహనాలపై స్వామివారి ఉరేగింపును తిలకించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వివిధ విభాగాధిపతులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

రథసప్తమి సందర్భంగా తిరుమలకు విచ్చేసే భ‌క్తులు చ‌లికి, ఎండ‌కు ఇబ్బంది ప‌డ‌కుండా మాడ వీధుల్లో తాత్కాలిక‌ షెడ్లు ఏర్పాటు చేయ‌ల‌న్నారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం 3.5 ల‌క్ష‌ల ల‌డ్డూలు బ‌ఫ‌ర్ స్టాక్ ఉంచుకోవాల‌ని పోటు అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు తిల‌కించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహ‌న‌సేవ‌ల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌ని తెలిపారు. వాహ‌న‌సేవ‌ల ఎదుట ఆక‌ట్టుకునేలా సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయాల‌న్నారు. టీటీడీ నిఘా, భ‌ద్ర‌తా విభాగం అధికారులు పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని మెరుగైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

అన్నప్రసాదం అధికారులు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలలో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు తాగునీరు, మజ్జిగ, సాంబారు అన్నం, పెరుగు అన్నం, పులిహోర, పొంగలి వంటి అన్న ప్రసాదాలను నిరంతరాయంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తుల దాహార్తిని తీర్చడానికి శ్రీవారి సేవకుల సహకారంతో ఎప్పటికప్పుడు తాగునీరు అందించాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. మెరుగైన పారిశుద్ధ్య చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. అత్యవసర సేవలందించడానికి వీలుగా వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్సు వాహనాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు. మాడవీధులలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను సీనియర్‌ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. రథసప్తమి సందర్భంగా వివిధ రకాల ఫలపుష్పాలతో, పచ్చని తోరణాలతో, అందమైన అరటి చెట్లతో పందిళ్ళను ఏర్పాటు చేసి తిరుమాడ వీధులను అందంగా అలంకరించాలని ఉద్యానవన విభాగం అధికారులను ఈవో ఆదేశించారు.

రథసప్తమిని పురస్కరించుకొని ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు తెలిపారు. ఆ రోజున ఎటువంటి ప్రత్యేక దర్శనాలు (విఐపి బ్రేక్‌, వయోవృద్ధులు, వికలాంగులు మరియు చంటిపిల్లల తల్లిదండ్రులకు) ఉండవని చెప్పారు. అదే విధంగా ఫిబ్ర‌వ‌రి 14వ తేదీ తెల్ల‌వారు జామున 12 గంట‌ల నుండి 16వ తేదీ అర్థ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు టిబి, ఎంబిసి – 34 కౌంట‌ర్ల‌ను మూసివేసి, సిఆర్‌వో, శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నాల‌ స‌మూదాయంలో మాత్ర‌మే గ‌దులు కేటాయించాల‌న్నారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని టీటీడీ భద్రతా విభాగం మరియు పోలీసు అధికారులు స‌మ‌న్వ‌యంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు.

ఈ స‌మావేశంలో జేఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, సిఈవో శ్రీ ష‌ణ్ముఖ కుమార్‌, సిఈ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఎస్‌.ఇ-2 జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, సిపిఆర్‌వో డా.టి.ర‌వి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

వాహనసేవల వివరాలు :

తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.40 గంట‌ల‌కు) – సూర్యప్రభ వాహనం

ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం

ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం

మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం

మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం

సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం

రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.