LOCAL TEMPLES GEAR UP FOR RADHASAPTAMI FETE _ ఫిబ్ర‌వ‌రి 16న టీటీడీ స్థానికాల‌యాల్లో రథసప్తమి

Tirupati, 14 February 2024: The annual Surya Jayanti fete also known as Radhasaptami will be observed with celestial grandeur in all TTD-run temples on February 16.

The arrangements are being made in Sri Padmavathi Ammavari Temple in Tiruchanur, Sri Govindaraja Swamy Temple, Sri Kodandaramalayam in Tirupati, Sri Kalyana Venkateswara Swamy Temple in Srinivasa Mangapuram, Chandragiri Ramalayam etc.

Respective officers are making elaborate arrangements for the festival.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 16న టీటీడీ స్థానికాల‌యాల్లో రథసప్తమి

ఫిబ్ర‌వ‌రి 14, తిరుపతి 2024: టీటీడీ స్థానికాల‌యాల్లో ఫిబ్ర‌వ‌రి 16వ తేదీ శుక్ర‌వారం రథసప్తమి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం త‌దిత‌ర ఆల‌యాల్లో రథసప్తమి పర్వదినం నిర్వ‌హిస్తారు.

ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యజయంతిని పురస్కరించుకొని టీటీడీ స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఆరోజు ఉదయం భానుని తొలిరేఖలు సూర్యప్రభ వాహనంపై కొలువైన స్వామివారి నుదుట‌న‌, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు ఎదురుచూస్తుంటారు.

తిరుచానూరులో..

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ఫిబ్ర‌వరి 16న ఉదయం 7.15 నుండి 8.15 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8.45 నుండి 9.45 గంటల వరకు హంస వాహనం, ఉదయం 10.15 నుండి 11.15 గంటల వరకు అశ్వ వాహనం, ఉదయం 11.45 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు గరుడ వాహనంపై విహ‌రించి అమ్మ‌వారు భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు. మధ్యాహ్నం 1.15 నుండి 2.15 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు గజ వాహనంపై ద‌ర్శ‌న‌మిస్తారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న‌ శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో…

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు సప్తవాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహిస్తారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీ గోవిందరాజస్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హంస వాహ‌నం, ఉద‌యం 9.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు హనుమంత వాహ‌నం, ఉద‌యం 11.30 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు పెద్దశేష వాహ‌నం, మ‌ధ్యాహ్నం 1 నుండి 2 గంట‌ల వ‌ర‌కు ముత్యపుపందిరి వాహ‌నం, మ‌ధ్యాహ్నం 2.30 నుండి 3.30 గంట‌ల వ‌ర‌కు సర్వభూపాల వాహ‌నం, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు గరుడవాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో…

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉదయం 7 నుండి 9 గంటల వ‌ర‌కు సూర్యప్రభవాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వ‌ర‌కు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు అభ‌య‌మిస్తారు.

శ్రీనివాసమంగాపురంలో…

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు బంగారు తిరుచ్చిపై భక్తులను అనుగ్ర‌హిస్తారు.

చంద్ర‌గిరిలో…

చంద్ర‌గిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉదయం 8 గంట‌ల‌కు తిరుచ్చిపై స్వామివారి వీధి ఉత్స‌వం జ‌రుగ‌నుంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.