LOCAL TEMPLES OF TTD REOPEN_ టిటిడి స్థానిక ఆలయాల్లో దర్శనం పునఃప్రారంభం
Tirupati, 8 August 2017: The local temples under the umbrella of TTD re-opened on Tuesday after they were closed on Mondayevening following Chandra Grahanam.
The Tiruchanoor temple opened by 4am while Srinivasa Mangapuram temple by 5am after performing Suddhi, Punyahavachanam. The devotees were allowed after 7:30am onwards for Sarva darshan.
Similarly Sri Govinda Raja Swamy temple, the Kodanda Rama Swamy temple in Tirupati, in Chandragiri, Appalayagunta Prasanna Venkateswara Swamy temples also opened after performing suddhi.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
టిటిడి స్థానిక ఆలయాల్లో దర్శనం పునఃప్రారంభం
తిరుపతి, 2017 ఆగస్టు 08: టిటిడికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో మంగళవారం ఉదయం నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆగస్టు 7వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా టిటిడి స్థానికాలయాలను సోమవారం సాయంత్రం 4.30 గంటలకు మూసివేసిన విషయం విదితమే.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 4 గంటలకు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం చేశారు. అనంతరం 7.30 గంటలకు సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 5 గంటలకు తెరిచి శుద్ధి అనంతరం ఉదయం 6.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయాన్ని మంగళవారం ఉదయం 5.30 గంటలకు తెరిచారు. శుద్ధి తరువాత భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 4 గంటలకు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 5 గంటలకు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం చేపట్టారు. ఉదయం 8 గంటల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయాన్ని ఉదయం 4 గంటలకు తెరిచి శుద్ధి అనంతరం ఉదయం 6 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని ఉదయం 4.30 గంటలకు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.