LOCAL TEMPLES WITNESS V-DAY RUSH _ టిటిడి స్థానికాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు

TIRUPATI, 13 JANUARY 2022:  All the sub temples of TTD in Tirupati observed Vaikunta Ekadasi festivities with religious fervour and witnessed pilgrim influx.

The temples of Padmavathi Ammavaru at Tiruchanoor, Srinivasa Mangapuram, Appalayagunta, Sri Kodanda Ramalayam etc.have made special arrangements to match the auspicious occasion.

The Vaikuntha Dwaram which was recreated in Srinivasa Mangapuram added the required flavour to this most auspicious event.

The top brass officials of TTD in Tirupati participated in the event.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి స్థానికాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు

తిరుపతి, 13 జ‌న‌వ‌రి 2022: టిటిడి ఆధ్వర్యంలోని తిరుపతి, పరిసర ప్రాంతాల్లో గల ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, అప్పలాయగుంట, తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం, శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయాల్లో ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు వైకుంఠ ద్వారం దర్శనం చేసుకున్నారు.

ఈ కార్యక్రమాల్లో ఆయా ఆలయాల అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.