LOKABHIRAMA SRIRAMA RIDES ON GAJA VAHANAM _ గజ వాహనంపై లోకాభిరాముడు

Tirupati, 10 April 2024: As part of Sri Kodandarama Swamy annual Brahmotsavam, Srirama blessed the devotees on the Gaja Vahanam on the sixth evening on Wednesday.

While the Gajarajas, bulls and horses were leading the grand paraphernalia accompanied by colourful bhajan groups playing kolatams, the Lord strolled through the four Mada streets of the temple.

Gaja Vahana has an importance in Hindu Sanatana Dharma as it is a symbol of royalty and majesty.  

In the Vahana Seva, Tirumala Sri Peddajiyarswamy along with his deputy Sri Chinnajiyar Swamy,  Deputy EOs Sri Govinda Rajan, Smt. Nagaratna, AEO Sri Parthasaradhi, Superintendent Sri Somasekhar, Kankanabhattar Sri Sitaramacharyulu, Temple Inspectors Sri Chalapati, Sri Suresh, devotees participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గజ వాహనంపై లోకాభిరాముడు
 
తిరుపతి, 2024 ఏప్రిల్ 10: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం రాత్రి 7 గంటలకు స్వామివారు గజ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. 
 
గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు.
   
హైందవ సనాతన ధర్మంలో గజ వాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో గానీ, రాజదర్బారుల్లో గానీ, ఉత్సవాల్లో గానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవలో గజేంద్రుడు శ్రీవారిని వహించునట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామికృపకు పాత్రులుకాగలరు.
 
 వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవోలు శ్రీ గోవింద రాజన్, శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ‌శేఖ‌ర్‌, కంకణభట్టర్ శ్రీ సీతారామాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.