LORD RAMA RIDES ON BHAKTA HANUMAN

Tirupati, 28 March 2018: The fourth day evening witnessed the grand procession of of Lord Sri Rama on his most favourite and loyal ride Lord Hanuman.

Hanuman for his noble services and total surrender towards His Master is being revered as Lord on par with Lord Sri Rama.

The devotees had twin delight of having darshan of both Lord Sri Rama and Lord Hanuman.

AEO Sri Ramaraju, Superintendent Sri Subramanyam, Sri Nagaraju were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

హ‌నుమంత‌ వాహనం :

మార్చి 28, ఒంటిమిట్ట, 2018: శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధ‌వారం రాత్రి 8 నుండి 9.30 గంటల వరకు హ‌నుమంత‌ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం ద్వారా తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. దాసభక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఏఈవో శ్రీ రామరాజు, సూపరింటెండెంట్లు శ్రీ సుబ్రమణ్యం, శ్రీ నాగరాజు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.